ఆగస్ట్ 15న ప్రభాస్ ‘సాహో’ రిలీజ్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ను వెంటాడుతున్న ఓ సస్పెన్స్ కు బ్రేక్ పడింది. ప్రెస్టీజియస్ మూవీ “సాహో” రిలీజ్ డేట్ ను ప్రకటించింది మూవీ టీమ్. ఈ సినిమాను వచ్చే ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. బాహుబలి తర్వాత ప్రభాస్ యాక్ట్ చేస్తున్న మూవీ సాహో కావడంతో ఇటు ఫ్యాన్స్ తో పాటు అటు ఫిలిం సర్కిల్ లో కూడా ఈ సినిమాపై హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.

ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ గా వస్తోన్న ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సుజీత్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ విశేషాలను చాప్టర్స్ గా రిలీజ్ చేస్తున్న మూవీ టీం రీసెంట్ గా ప్రభాస్ బర్త్ డే సందర్భంగా చాప్టర్ 1 ను రిలీజ్ చేసింది. దీంతో సినిమాపై హైప్ మరింత పెరిగిపోయింది. హై బడ్జెట్ తో వస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. యువీ క్రియేషన్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీకి శంకర్ ఎహసాన్ లాయ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates