ఆగి కొనాల్సిందే : బంగారం ధర బాగా తగ్గింది

goldనిన్నటి వరకు స్టాక్ మార్కెట్లు రక్త కన్నీరు చూపించాయి. ఐదు సెషన్ల తర్వాత ఫిబ్రవరి 8వ తేదీ గురువారం కొనుకున్నాయి. 330 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ ముగిసింది. హమ్మయ్యా అని పెట్టుబడిదారులు రిలాక్స్ అయిన వెంటనే మరోషాక్. బంగారం బాగా తగ్గింది. నిన్నటికి నిన్న ఒక్కసారిగా 450 రూపాయలు పెరిగింది. 24 గంటలు గడవకముందే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.650 తగ్గింది. ఒక్క రోజులోనే మూడు వారాల కనిష్టానికి పడిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్ లో 10 గ్రాముల 24 క్యారెట్లు.. రూ.30వేల 580 దగ్గర ట్రేడ్ అవుతుంది.

బంగారం బాటలోనే వెండి కూడా తగ్గింది. కేజీ వెండి రూ.450 తగ్గింది. ప్రస్తుతం రూ.38వేల 900గా ఉంది. స్టాక్ మార్కెట్ మళ్లీ లాభాల్లోకి రావటం, ఆయిల్ కంపెనీలు లాభాల్లో ఉండటంతో పెట్టుబడు అన్నీ స్టాక్ మార్కెట్ వైపు వెళ్లాయి. దీంతో ఒక్కసారిగా బంగారం ధర తగ్గింది. ప్రస్తుతం బంగారం కొనుగోళ్లకు అనుకూలమా లేదా అంటే మాత్రం కొన్నాళ్లు వేచి చూస్తే బెటర్ అంటున్నారు. స్టాక్ మార్కెట్ మళ్లీ బాగా పుంజుకుంటే బంగారం ధర మరికొంచెం తగ్గే అవకాశం ఉందంటున్నారు.

Posted in Uncategorized

Latest Updates