ఆగేది లేదు కట్టుడే : ఎన్నికల్లోగా రామాలయం పనులు ప్రారంభం

వచ్చే ఎన్నికల్లోగా అయోధ్యలో రామాలయ నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.శుక్రవారం (జూలై-13) హైదరాబాద్ లో బీజేపీ ఎన్నికల మేనేజ్ మెంట్ కమిటీతో అమిత్ షా సమావేశమయ్యారు. గతంలో చెప్పిన పనులు చేయకపోవడంపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశాడు. వచ్చేనెల 15వతేదీలోగా పని పూర్తి చేయాలని నేతలకు టార్గెట్ ఇచ్చారు. యాత్రలు చేయాలని సూచించారు. యాత్రలో ప్రతి గ్రామాన్ని టచ్ చేయాలన్నారు. ఆగస్టులో 15 రోజుల యాత్రకు ప్లాన్ చేయాలని చెప్పారు.

ముఖ్యంగా వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలో నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు అమిత్ షా. ముందస్తు ఎన్నికలు వచ్చినా అన్ని విధాల సిద్ధంగా ఉండాలని.. కేంద్రంలో మళ్లీ మోడీ పగ్గాలు చేపట్టేలా, తెలంగాణలో ఎంపీ స్థానాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.

Posted in Uncategorized

Latest Updates