ఆగ్రాలో ఆరుగురు మృతి…..నీట మునిగిన తాజ్ మహల్

24 గంటలుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆగ్రాలోని తాజ్ మహల్ పరిసర ప్రాంతమంతా జలమయమైంది. తాజ్ మహల్ చుట్టుపక్కల భారీగా వర్షపు నీరు చేరింది. ఆగ్రాలో భారీ వర్షాల కారణంగా….800 కోట్ల రూపాయల విలువైన ప్రాపర్టీ డామేజ్ అయింది. రోడ్లు ధ్వంసమయ్యాయి. కరెంట్ స్ధంభాలు విరిగిపడ్డాయి. నిత్యం రద్దీగా ఉండే సిటీలోని MG రోడ్డులోని పెద్ద ఎత్తున చెట్లు పడిపోయాయి. మూడగుల లోతులో సిటీలోని రోడ్లు  నీటమునిగాయి. ఇళ్లల్లోకి నీరు చేరి….పలు వస్తువులు కొట్టుకుపోయాయి. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. మరోవైపు భారీ వర్షాల కారణంగా ఆగ్రాలో ఆరుగురు మృతిచెందారు. భాధిత కుటుంబాలకు 4 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది యూపీ ప్రభుత్వం. రెండు రోజుల పాటు ఆగ్రాలోని అన్నీ స్కూళ్లు మూసియేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం రాత్రి గాలి భీభత్సవంతో మరోసారి భారీ వర్షం పడే అవకాశముందని ఇప్పటికే ఆగ్రా సిటీ ప్రజలను అధికారులు అలర్ట్ చేశారు.

Posted in Uncategorized

Latest Updates