ఆగ్రాలో దారుణం.. ఇంటర్ అమ్మాయిపై అత్యాచారం

ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం జరిగింది. ఆగ్రాలోని యమునా నది ఒడ్డున ఓ అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు ఇద్దరు దుండగులు. సాయంత్రం వేళ కోచింగ్ క్లాస్ కు వెళ్తున్న అమ్మాయిని.. ఇద్దరు యువకులు అడ్డగించారు. అక్కడి పొయ్యా ఘాట్ లో జనం లేని ఏరియాకు తీసుకెళ్లారు. అమ్మాయిపై ఇద్దరూ అత్యాచారం చేసి పారిపోయారు. తీవ్రగాయాలపాలైన బాధితురాలిని… అట్నుంచి వెళ్తున్న ఓ వ్యక్తి చూసి… దగ్గర్లోని హాస్పిటల్ లో అడ్మిట్ చేశాడు.

విషయం తెలిసి షాక్ అయిన తల్లిదండ్రులు.. బాధితురాలిని ఆగ్రాలోని ఎస్ఎన్ మెడికల్ కాలేజీలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. ఇద్దరు తనను కిడ్నాప్ చేసి… అత్యాచారం చేశారని బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఆ ప్రాంతంలో మరో ఇద్దరు యువకులు ఉన్నారని వివరించింది. కేసు రిజిస్టర్ చేసిన పోలీసులు… నిందితులు పరారీలో ఉన్నారని.. పట్టుకుంటామని తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates