ఆజాద్ ఎన్ కౌంటర్ కేసు: 29 మంది పోలీసులకు కోర్టు సమన్లు

aajad-01ఆజాద్ అలియాస్ చెరుకూరి రాజ్ కుమార్ ఎన్ కౌంటర్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఆజాద్ ఎన్ కౌంటర్ కేసులో గురువారం (ఫిబ్రవరి-15) ఆదిలాబాద్ కోర్టు తీర్పు చెప్పింది.  ఎన్ కౌంటర్ లో పాల్గొన్న 29 మంది పోలీసులపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీనిపై విచారణ చేయాలని చెప్పింది. ఈ క్రమంలోనే 26మంది పోలీసు అధికారులకు సమన్లు జారీ చేసింది ఆదిలాబాద్ కోర్టు. కోర్టు తీర్పుపై ఆనందం వ్యక్తం చేశారు ఆజాద్ భార్య పద్మ. న్యాయ వ్యవస్థపై నమ్మకం బలపడిందన్నారు. ఎన్ కౌంటర్ చేసిన పోలీసులకు శిక్ష పడుతుందని ఆశిస్తున్నానన్నారు పద్మ.

Posted in Uncategorized

Latest Updates