ఆటగదరా శివ : సమయానికి వచ్చే వాడు దేవుడు కాదు.. యముడు

SIVAజబర్దస్త్ టీం హైపర్ ఆది, చమ్మక్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ఆటగదరా శివ. ఆ నలుగురు సినిమా ఫేం చంద్రసిద్దార్థ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ట్రైలర్ గురువారం (జూన్ -7) రిలీజైంది. రెండు నిమిషాల నిడివిగల ఈ ట్రైలర్‌ లో జబర్దస్త్ షో నటీనటులే ఎక్కువగా వున్నారు. ఉరిశిక్ష పడిన ఓ ఖైదీ జైలు నుంచి పరారైన దగ్గర నుంచి మొదలైంది. హైపర్ సెటైర్ల కొస్తే.. దెబ్బ తగిలితే బ్లడ్ రాక బటర్ మిల్క్ వస్తుందా.. జురాసిక్ పార్క్‌ కి వాచ్‌ మేన్‌ లా వున్నాడు.. ఎవరికైనా ముఖానికి గెడ్డం వుంటుంది.. వీడికేంటి గడ్డానికి ముఖముంది  అనే డైలాగ్స్ తో అదరగొట్టారు.  పంచ్‌ డైలాగ్‌లు ఈ సినిమాకు స్పెషల్‌ అట్రాక్షన్‌ గా ఉండబోతోన్నాయి. సమయానికి వచ్చే వాడు దేవుడు కాదు.. యముడు, చచ్చేవాడు… చంపేవాడు కలిసే తిరుగుతున్నారు లాంటి డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి.  నాలుగేళ్ల తర్వాత డిఫరెంట్‌ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు డైరెక్టర్ చంద్రసిద్దార్థ. గతంలో ఆ నలుగురు, మధుమాసం, అందరి బంధువయా వంటి సినిమాలను చేశాడు. భజరంగీ భాయిజాన్, లింగ వంటి చిత్రాలను నిర్మించిన రాక్‌లైన్ వెంకటేష్ దీని ప్రొడ్యూసర్.

 

 

Posted in Uncategorized

Latest Updates