ఆటోలోనే అత్యాచారయత్నం.. కిందకి దూకి తప్పించుకున్న యువతి

rapeకలకత్తాలో లైంగిక వేధింపు నుంచి తప్పించుకునేందుకు ఓ యువతి నడుస్తున్న ఆటోలో నుంచి దూకేసింది. ఆదివారం(మే-13) ఉదయం 11 గంటల సమయంలో సౌత్ కల్ కతాలో ఈ ఘటన జరిగింది. ఆటోలో ఎక్కిన ముగ్గురు యువకులు ఆమెపై లైంగిక దాడి చేయడంతో.. వారి నుంచి తప్పించుకునేందుకు యువతి ఆటోలో నుంచి దూకేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఆదివారం(మే-13) ఉదయం 11 గంటల సమయంలో ఇంటికి వెళ్లేందుకు ఓ యువతి సౌత్ కలకత్తాలోని గరియహత్ ఏరియాలో ఆటో ఎక్కింది. అప్పటికే ఆటోలో యుగ్గురు యువకులు ఉన్నారు. దీంతో ఆ యువతి డ్రైవర్ ఎడమవైపు కూర్చొంది. ఆ యువతి ఆటోలో ఎక్కిన కొన్ని నిమిషాల్లోనే వెనుక వైపు కూర్చొన్న యువకులు టచ్ చేస్తూ అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. డ్రైవర్ కుడివైపు కూర్చొన్న వ్యక్తి కూడా అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు.

దీంతో ఆ యువతి డ్రైవర్ ను ఆటో ఆపాలని కోరింది.  డ్రైవర్ ఆటో ఆపేందుకు నిరాకరించాడు. దీంతో భయానికి గురైన ఆమె సెలింపూర్ ఏరియాలో రోడ్డుపై వెళ్తున్న ఆటోలో నుంచి కిందకి దూకేసింది. తనను వేధింపులకు గురిచేసిన వారిపై యువతి పోలీస్ స్టేషన్ లో కంఫ్లెయింట్ ఇవ్వడంతో సీసీ టీవీ పుటేజీ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. శనివారం(మే-12) న మహిళా ప్రయాణికుల ఎదురుగానే అసిత్ రాయ్ అనే ఓ వ్యక్తి వికృతచేష్టలకు పాల్పడిన 24 గంటలు.. గడవక ముందే ఈ దారుణం జరిగింది. అసిత్ రాయ్ బస్సులో చేసిన పనిని ఓ మహిళా ప్రయాణికురాలు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.

Posted in Uncategorized

Latest Updates