ఆటోలో వచ్చిన హీరో…అవాక్కయిన జనం

నా పేరు శివ, ఆవారా సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో కార్తీ. ఊపిరి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కార్తీ గతేడాది ఖాకీ సినిమాతో మంచి హిట్‌కొట్టాడు. ఇటీవల చినబాబుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయం సాధించాడు. అలాంటి హీరో కార్తీ ఆటోలో రావడంతో అందరికి ఆశ్చర్యం కలిగింది.

కుటుంబ కథా, రైతు, గ్రామీణ వాతావరణలో తెరకెక్కిన ఈ సినిమాను హీరో సూర్య నిర్మించారు. ఈ సినిమా యూనిట్‌ సక్సెస్‌ మీట్‌ లు నిర్వహిస్తూ ఉంది. వీటికి హాజరయ్యేందుకు వస్తున్న  కార్తీ… ట్రాఫిక్‌, వర్షం కారణంగా ఆలస్యమవుతుండటంతో.. ఏమాత్రం ఆలోచించకుండా కారు దిగి, వేరే మార్గంలో ఆటోలో వచ్చాడు. కార్తీ అలా రావడంతో అక్కడ ఉన్నవారంతా అవాక్కయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Posted in Uncategorized

Latest Updates