ఆటో డ్రైవర్ కూతురు టాప్: SSCలో 99.31 శాతం

gujarat-autoప్రైవేట్ స్కూల్లో చదివిన విద్యార్ధులే మంచిగా చదువుతారు…వారికే పరీక్షల్లో మంచి ర్యాంకులు వస్తాయనుకుంటే పొరపాటు. ప్రస్తుతం ప్రభుత్వం స్కూళ్లలో కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా విద్యనందిస్తున్నారు టీచర్లు. విద్యార్థులు తమ ప్రతిభను చాటుతున్నారు. గుజరాత్ సెకండరీ, హైయర్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్(GSHSEB)  విడుదల చేసిన SSC ఫలితాల్లో ప్రభుత్వ స్కూల్లో చదివిన ఓ ఆటో డ్రైవర్ కూతురు ఆఫ్రీన్ 99.31 శాతం సాధించింది. ఆహ్మదాబాద్‌లోని FD హైస్కూల్‌లో చదివింది ఆఫ్రీన్.

పరీక్షలో మంచి మార్కులు వస్తాయనుకున్నానని…టాప్ మార్కులు వస్తాయనుకోలేదని తెలిపింది ఆఫ్రిన్. సైన్స్ స్ట్రీమ్‌లో అడ్మిషన్ తీసుకుని…ఎలాగైనా డాక్టర్‌ని అవుతానని తెలిపింది. తన కూతురిని డాక్టర్ ను చేసి…ఆమె కలను నెరవేర్చుతానని తెలిపాడు ఆమె తండ్రి హమ్జా.

 

Posted in Uncategorized

Latest Updates