ఆటో డ్రైవర్ నిజాయితీ : అభినందించిన పోలీసులు

హైదరాబాద్ : ఆటోలో మరిచిపోయిన బ్యాగును డ్రైవర్ నిజాయితీతో తిరిగి అప్పగించాడు. బేగంపేటలోని మెథడిస్ట్ కాలనీకి చెందిన పద్మా సుబ్రహ్మణ్యం ఆటోలో మలక్‌పేటకు వెళ్లింది. అక్కడ దిగి వెళ్లేటప్పుడు ఆమె వెంట తెచ్చుకున్న బ్యాగ్‌ను ఆటోలోనే మరిచిపోయింది. ఆలస్యంగా బ్యాగు విషయం గుర్తుకురాగా వెంటనే పంజాగుట్ట పోలీసులకు సమాచారం అందించింది. అయతే ఆటోలో బ్యాగు ఉండటాన్ని గమనించిన మలక్‌పేటకు చెందిన ఆటోడ్రైవర్ రాజు… అందులో ఉన్న చిరునామా ఆధారంగా పంజాగుట్ట పోలీసులకు సమాచారమిచ్చాడు. దీంతో వెంటనే పోలీసులు బాధితురాలు పద్మకు ఈ విషయం చెప్పారు.  పోలీసుస్టేషన్‌కు చేరుకున్న ఆటోడ్రైవర్ రాజు బ్యాగును పోలీసుల సమక్షంలో ఆమెకు అప్పగించాడు. బ్యాగులో ల్యాప్‌టాప్‌తో పాటు విలువైన మొబైల్ ఫోన్ ఉంది. ఈ సందర్భంగా ఆటోడ్రైవర్ రాజును అభినందించారు పోలీసులు.

Posted in Uncategorized

Latest Updates