ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం..ఓ మహిళ మృతి

ADBAUTOACCIDENT-AVఆదిలాబాద్ జిల్లాలో ఓ ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం…మహిళ నిండు ప్రాణాలు తీసింది. ఆదిలాబాద్ పట్టణంలోని బస్ స్టాండ్ ఎదురుగా స్పీడ్ గా వస్తున్న ఆటో డివైడర్ ను ఢీకొట్టి పల్టీ కొట్టింది.  అందులో ప్రయాణిస్తున్న మహిళ స్పాట్ లోనే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని రిమ్స్ కు తరలించారు. వీరిలో ఆటో డ్రైవర్ పరిస్థితి కూడా విషమంగా ఉందంటున్నారు డాక్టర్లు. కాగా అంతకు ముందే ఆటో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మరో వ్యక్తిని ఢీ కొనగా.. అతడికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ర్యాష్ డ్రైవింగే ప్రమాదానికి కారణమంటున్నారు స్థానికులు.

Posted in Uncategorized

Latest Updates