ఆడది కాదు….ఆదిపరాశక్తి : టచ్ చేసినోడి తాట తీసింది

ఓ మహిళ ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి ప్రశంశలందుకుంటుంది. ఆమె ధైర్యాన్ని ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు. మేము గౌరివించినంతసేపే మహిళలం, ఎదురుతిరుగితే ఆది పరాశక్తులం అవుతామని ఓ మహిళ చూపించిన ధైర్యసాహసాలు…. ఆడవాళ్లను టచ్ చేయాలనుకునే వారి గుండెళ్లో గుబులు పుట్టిస్తుంది. అమెరాకాలోని ఓ రెస్టారెంట్ లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అమెరికాలోని సావన్నాలో విన్నీ వాన్ గోగో రెస్టారెంట్‌ లో ఓ వెయిట్రెస్ కస్టమర్లకు సర్వ్ చేస్తున్న సమయంలో ఓ కస్టమర్ ఉద్దేశ్యపూర్వకంగానే వెయిట్రస్ వెనుక టచ్ చేసుకుంటూ వెళ్లాడు. దీంతో వెంటనే స్పందించిన ఆ వెయిట్రస్ …… వెళ్లి అతడి వెనక్కి లాగి కిందపడేసి చితక్కొట్టింది. చేసేందేం లేక ఆమె చేతిలో దెబ్బలు తింటూ చూస్తూ ఉండిపోయాడు ఆ వ్యక్తి. ఆ సమయంలో అతడి భార్యా, పిల్లలు కూడా రెస్టారెంట్ లో ఉన్నారు. పక్కనే భార్యా, పిల్లలను పెట్టుకొని కూడా ఇంత నీచంగా ప్రవర్తిస్తావా అంటూ అక్కడున్న వారందరూ కూడా అతడిని తిట్టిపోశారు. జూన్-30, 2018న జరిగిన ఈ ఘటనంతా రెస్టారెంట్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది.  సీసీ పుటేజి ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు ఆ యువతి దైర్యాన్ని మెచ్చుకుంటున్నారు.

Posted in Uncategorized

Latest Updates