ఆత్మను అమ్ముకుని బతికే నీచుడు చంద్రబాబు : మోత్కుపల్లి

MOTHKUPALLYఆత్మను అమ్ముకుని బతికే నీచుడు చంద్రబాబు అన్నారు మోత్కుపల్లి నర్సింహులు. ఎన్టీఆర్ ను కుట్ర చేసి చంద్రబాబు గద్దె దించారన్నారు. టీడీపీ నుంచి మోత్కుపల్లిని బహింష్కరించిన క్రమంలో ఆయన మంగళవారం (మే-29) మీడియాతో మాట్లాడారు. ఇన్నిరోజులుగా ఏమీ ఆశించకుండా చంద్రబాబు దగ్గర పనిచేసినందుకు నన్ను బహిష్కరించారని ఆవేదన వ్యక్తం చేశారు మోత్కుపల్లి. ఉమ్మడి రాష్ట్రం ఉంటే నన్ను వదిలేవాడివేనా అని చంద్రబాబును ప్రశ్నించిన మోత్కుపల్లి..అన్ని విధాలుగా తనను వాడుకున్నారన్నారు.

రాజ్యసభ ఇస్తానన్నాడు..గవర్నర్ అన్నాడు..అదీ లేదు, ఇదీ లేదన్నారు. పదేళ్లు చంద్రబాబుకు అండగా ఉన్నానని, చివరకు నాకు మోసం చేశాడన్నారు. నమ్మక ద్రోహీ చంద్రబాబు అన్నారు. ప్రపంచంలో చంద్రబాబు అంత మోసగాడు, దొంగ, నీచుడు ఇంకెవరూ లేడన్నారు.  అధికారం కోసం చంద్రబాబు ఎంత నీచపనికైనా దిగజారుతాడని చెప్పారు మోత్కుపల్లి. టీడీపీ జెండా నీది కాదని, ఎన్టీఆర్ ది అన్నారు. నేను లేకుంటే భయటికిరాని చంద్రబాబు పిరికిపందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మంచితనాన్ని చంద్రబాబు గుర్తించలేదని, మీటింగ్ తాను లేకుండానే జరపడం బాధేసిందన్నారు. చంద్రబాబు మగాడైతే సొంత జెండాతో రావాలన్న మోత్కుపల్లి..పనికిమాలిన వ్యక్తులతో తనను తిట్టిస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని ఊసిగెలిపే మాటలతోను చిచ్చు రగిలిందన్నారు.

కేసీఆర్ పేరు చెబితే చంద్రబాబు గజగజలాడుతాడన్నారు. మాల మాదిగలను మోసం చేసిన చంద్రబాబు , ఓటుకు నోటుకు కేసులో అడ్డంగా దొరికిన దొంగ అన్నారు. దళితుల పట్ల చంద్రబాబుకు ఏనాడు చిత్తశుద్ధి లేదని తెలిపిన మోత్కుపల్లి..తెలంగాణలో తనకు చెడ్డపేరు వచ్చేలా బాబు వాడుకున్నారన్నారు. మాల-మాదిగల మధ్యన పంచాయితీ పెట్టిన దుర్మార్గుడు చంద్రబాబు అన్నారు. దైర్యం ఉంటే తెలంగాణలో చంద్రబాబు ప్రచారం చేయమని, మోడీ దగ్గరకు పదేపదే పోయి కేసులు కొట్టివేయించుకున్నారన్నారు. ప్రేమ అభిమానాలతో తాను డబ్బులు లేకపోయినా గెలిచానని, తెలంగాణ ప్రజలు చంద్రబాబును ఎప్పుడో సస్పెండ్ చేశారన్నారు. పెద్దనోట్ల రద్దు గురించి మోడీకి చెప్పిందే చంద్రబాబు అని..నాలుగు సంవత్సరాలు మోడీ చుట్టి తిరిగి చివరకు ప్రధానికే నమ్మకం ద్రోహం చేసిన గజదొంగ చంద్రబాబు అన్నారు. ఎన్నికల ఖర్చు చంద్రబాబు పెట్టినంత డబ్బు ఏ రాజకీయ నాయకుడు పెట్టడన్నారు. చిన్న పనికి కూడా ప్లైట్ కావాలంటాడు.. ప్రజల డబ్బును దుర్వినియోగం చేస్తున్నాడన్నారు. రాబోయే కాలంలో ఆంధ్ర ప్రజలు నీకు సరైన బుధ్ది చెబుతారని, సీఎం పదవి ఇదే లాస్ట్ అన్నారు. ప్రజల డబ్బును హెరిటేజ్ లో పెడుతున్నాడని, బ్లాక్ మనీని వైట్ కోసం నానా రకాల కంపెనీలు పెట్టాడన్నారు.

దయచేసి ఆంద్ర ప్రజలకు తెలిపేది రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబుకు ఓటు వెయ్య కూడదన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి రావద్దని తిరుమల శ్రీవారిని కోరుతున్నట్లు చెప్పారు. చంద్రబాబును ఓడించాలని ఏడుకొండలవాడిని వేడుకుంటున్నానన్నారు మోత్కుపల్లి. ఎన్టీఆర్ హయాంలోనే తన గౌరవం ఏంటో ఫోటోలను మీడియాకు చూపించారు. ఆలేరు ప్రాంతం దయవల్ల తాను ఆరుసార్లు గెలిచానని, చంద్రబాబు టికెట్ ఇవ్వకున్న ఇండిపెండెంట్ గా గెలిచిన రికార్డ్ తనకుందన్నారు మోత్కుపల్లి. చంద్రబాబు లేకపోయిన జగన్ ప్రత్యేక హోదా తెస్తారని, చంద్రబాబుపై 29 కేసులున్నాయని బాబుపై సీబీఐ విచారణ జరిపించాలని మోడీని వేడుకుంటున్నట్లు చెప్పారు. చంద్రబాబుతో తనకు ప్రాణ హాని ఉందని, ఇప్పటికైనా తనకు క్షమాపణ చెబితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారన్నారు.  నా జీవితమంతా ఓ భ్రష్టుడి కోసం పని చేశానని తెలుసుకున్నానన్నారు. నీతిమంతుడి ముందు చంద్రబాబు నిలబడడని, జగన్, పవన్, కేసీఆర్, మోడీపై అనవసర ఆరోపణలు చేస్తున్నాడన్నారు మోత్కుపల్లి నర్సింహులు.

Posted in Uncategorized

Latest Updates