ఆదర్శ అత్తమామలు : అత్తారింటికి హెలికాఫ్టర్ లో కొత్త కోడళ్లు

two_aligarh_women_take_a_helicopter_doli_to_in_laws_house_1519275933జీవితంలో ఎప్పుడైనా హెలికాప్టర్ ను దగ్గర నుంచి చూడగలమా అనుకున్నారు. ఒక్కసారైనా హెలికాప్టర్ పక్కన నిలబడి ఫోటో దిగితే బాగుంటుంది అని కలలు కన్నారు ఆ ఇద్దరు అక్కాచెల్లెల్లు. అయితే కలలో కూడా ఊహించని రీతిలో అత్తవారింటికి హెలికాప్టర్ లో అడుగుపెట్టారు ఆ ఇద్దరు అక్కాచెల్లెల్లు. దీంతో ఏమి మాట్లాడాలో తెలియక సంతోషంతో వారి గొంతు మూగవోయింది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అలీఘర్ జిల్లాలోని బధియా గ్రామానికి చెందిన మీరా, రేఖ అక్కాచెల్లెల్లు. వీరికి మంగళవారం (ఫిబ్రవరి 20) మథురకు చెందిన కుశాల్ పాల్, కుశ్ లేంద్ర అనే ఇద్దరు అన్నదమ్మలతో అలీఘర్ లో వివాహం జరిగింది. కుశాల్ పాల్ పోలీస్ ఉద్యోగం చేస్తుండగా, కుశలేంద్ర ఓ ప్రైవేట్ కంపెనీలో జూనియర్ ఇంజినీర్ గా చేస్తున్నాడు. తమ కోడళ్లను హెలికాప్టర్ లో ఇంటికి తీసుకురావాలని పెళ్లికొడుకుల తండ్రి శివాజీ భావించారు. దీనికి రూ.3 లక్షలు ఖర్చు పెట్టి ఓ హెలికాప్టర్ ను బుక్ చేశాడు.

బుధవారం మధురలోని తన నివాసానికి తన కోడళ్లను హెలికాప్టర్ లో తీసుకొచ్చాడు. దీంతో ఆ అక్కాచెల్లెల్ల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. మధురకు హెలికాప్టర్ లో చేరుకున్నఈ కొత్త జంటలను చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. హెలికాప్టర్ పక్కన నుంచొని ఫోటోలు దిగారు. తమ కూతుళ్లపై వారి మామ చూపిన ప్రేమ చాలు.. మా అమ్మాయిలు ఎంత బాగా అత్తారింట్లో ఉంటారో అంటున్నాడు మీరా, రేఖ తండ్రి బన్వరి లాల్. .

two_aligarh_women_take_a_helicopter_doli_to_in_laws_house_1519275890 (1)

Posted in Uncategorized

Latest Updates