ఆదర్శ సేవలు: అధికారులకు టెక్స్ అవార్డ్స్

TEX AWARDSరాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాలను సక్రమంగా చేయడంతో పాటు.. పరిపాలనలో ప్రతిభచాటిన అధికారులకు ప్రభుత్వం ‘తెలంగాణ ఎక్స్‌లెన్స్‌(టెక్స్‌)’ అవార్డులను ప్రకటించింది. సాధారణ, ఆవిష్కరణలు-అమలు, ప్రధాన పథకాల అమలు అనే మూడు విభాగాల్లో వ్యక్తిగతంగా, గ్రూపుగా ఉత్తమ సేవలందించిన అధికారులను ఎంపిక చేసింది. పథకాల రూపకల్పన.. పథకాలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దిన 13 మంది అధికారులకు పురస్కారాలను అందించాలని ప్రభుత్వానికి సెలక్షన్‌ కమిటీ సిఫార్సు చేసింది. మరోవైపు పరిపాలనలో అసాధారణ పనితీరు కనబరిచిన మరో ఇద్దరు అధికారుల పేర్లను సెర్చ్‌ కమిటీ సిఫార్సు చేసింది. సెర్చ్, సెలక్షన్‌ కమిటీల సిఫార్సుల ప్రకారం మొత్తం 15 మందికి పురస్కారాలను ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి శనివారం(మే-19) ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న అవార్డులను ప్రదానం చేయనున్నారు.

టెక్స్‌ అవార్డు విజేతలు.. 

1.సాధారణ విభాగం: వ్యక్తిగత కేటగిరీలో.. మాసం ప్రాజెక్టును అమలు చేసినందుకు నల్లగొండ కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌. గ్రూపు కేటగిరీలో.. కలెక్టర్‌ జ్యోతిబుద్ధప్రకాష్‌, ప్రస్తుత కలెక్టర్‌ డి.దివ్య, ఆదిలాబాద్‌ డీఎంహెచ్‌వో రాజీవ్‌రాజ్‌.

సంస్థ కేటగిరిలో.. డబుల్‌ బెడ్‌రూం పథకానికి సరిపడా భూములను సేకరించినందుకు GHMC కమిషనర్‌ డాక్టర్‌ బి.జనార్దన్‌రెడ్డి.

  1. ఇన్నోవేషన్‌ విభాగం: వ్యక్తిగత కేటగిరీలో.. వికాసం పేరుతో స్కూళ్లను ఏర్పాటు చేసినందుకు మంచిర్యాల కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌.

సంస్థ కేటగిరీలో.. వాటర్‌బోర్డు మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం.దానకిషోర్‌.

  1. కేసీఆర్‌ కిట్‌: వ్యక్తిగత కేటగిరీలో.. సూర్యాపేట కలెక్టర్‌ కె.సురేంద్రమోహన్‌. గ్రూపు కేటగిరీలో.. కరీంనగర్‌ కలెక్టర్‌ సర్ఫరాజ్‌అహ్మద్‌, డీఎంహెచ్‌వో రాజేశం, అడ్మినిస్ట్రేటర్‌ మహ్మద్‌అలీమ్‌.

సంస్థ విభాగంలో.. కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ వాకాటి కరుణ.

  1. భూరికార్డుల నవీకరణ: గ్రూపు కేటగిరీలో.. జగిత్యాల కలెక్టర్‌ శరత్‌, ఆర్డీవో జి.నరేందర్‌, మేడిపల్లి తహసీల్దార్‌ ఎన్‌.వెంకటేశ్‌.

సంస్థ విభాగంలో.. నల్లగొండ కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌.

  1. ఐటీ ఆధారిత పరిపాలన: శ్యాండ్‌ ట్యాక్సీ పాలసీని అమలు చేసినందుకు పెద్దపల్లి పూర్వ కలెక్టర్‌ వర్షిణి.
  2. గొర్రెల పంపిణీ పథకం: సంస్థ విభాగంలో.. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాతోపాటు పశుసంవర్ధక శాఖ.
  3. సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌: సంస్థ విభాగంలో.. సిరిసిల్ల కలెక్టర్‌ డి.కృష్ణభాస్కర్‌, సిరిసిల్ల మున్సిపాలిటీ

అవార్డులకు ఎంపికైనవారిలో తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ జి.అశోక్‌కుమార్‌, వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్‌ వి.అనిల్‌కుమార్‌ కూడా ఉన్నారు.

Posted in Uncategorized

Latest Updates