ఆదిలాబాద్ ఏజెన్సీని వణికిస్తున్న చలి

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తోంది. మైదాన ప్రాంతాల్లో నిన్న(గురువారం)  4.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, ఏజెన్సీ ప్రాంతాల్లో 2 డిగ్రీలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలుల తీవ్రత పెరిగిపోవడంతో జిల్లాలో ఇద్దరు వృద్ధులు మృతిచెందారు. అన్ని పట్టణాలు, గ్రామాల్లోని స్కూల్ సమయాల్లో మార్పులు చేశారు. తెల్లవారుజామున  పొగమంచు  అధికంగా ఉండటంతో ప్రజలు బయటకు రాలేని పరిస్థితి ఉంది. అస్తమా రోగులు ఉదయం, సాయంత్రం  సమయాల్లో బయటకు వెళ్లకూడదని  వైద్యాధికారులు సూచిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates