ఆదిలాబాద్ ను కాశ్మీర్ లా మారుస్తా : కేసీఆర్

kcr adbఆదిలాబాద్ జిల్లా తెలంగాణకు కాశ్మీర్ లాంటిదని, అయితే ఇన్నేళ్లుగా జరగాల్సిన అభివృద్ధి జరగలేదన్న సీఎం కేసీఆర్.. ఆదిలాబాద్ ను కాశ్మీర్ లా తయారు చేస్తానన్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం (ఫిబ్రవరి-27) ఆదిలాబాద్ లో పర్యటించారు సీఎం. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు కేసీఆర్. దళితుల అభివృద్ధి కోసం 70 కోట్లు మంజూరు చేస్తామన్న సీఎం..ఆదిలావాద్ లో టౌన్ హోలు ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాల్లో డబుల్ బెడ్ రూమ్స్ కోసం వెయ్యి ఇండ్లను మంజూరు చేస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో డబ్బులకు కొదవలేదన్న కేసీఆర్..సంవత్సరంలోపు కోటీ ఎకరాలకు నీళ్లు వస్తాయన్నారు.

ఆదిలాబాద్ లో సస్యశ్యామలంగా వర్షాలు కురుస్తాయని, జిల్లావ్యాప్తంగా 18 కొత్త చెరువులను సాక్షన్ చేస్తామన్నారు. ఒక పేద ఇంట్లో పెండ్లి జరిగితే ఎంత ఇబ్బంది జరిగేదో అందరికీ తెలిసిందేనన్న కేసీఆర్ కళ్యాణ లక్ష్మీతో 75 వేలు ఇస్తున్న ఘనత టీఆర్ఎస్ ది అన్నారు. విద్యాభివృద్ధికి స్కాలర్ షిప్పులు పెండిగ్ లేకుండా క్లియర్ చేశామన్నారు. అగ్రి కల్చర్ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసి, వ్యవసాయంపై విద్యార్థుల్లో మరింత అవగాహన వచ్చేలా కృషి చేస్తామన్నారు. పల్లెల్లోకి LED బల్బులు తెచ్చిన ఘనత టీఆర్ఎస్ దేనని..మే నెల వరకు ఎకరాకు 8 వేల రూపాయలు చెక్కుల రూపంలో అందజేస్తామన్నారు. యాదవుల కోసం కోటీ గెర్రెలను పంపిణీ చేస్తున్నామన్నారు. రైతులకు పెట్టుబడి ఇస్తున్నామని, తెలంగాణ రైతాంగాన్ని ధనిక రైతాంగంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు సీఎం కేసీఆర్. 70 సంవత్సరాలు కాంగ్రెస్ నేతలు గాడిద పాలు తాగారా అని విరుచుకుపడ్డారు సీఎం. దమ్ముంటే కేసీఆర్ మాటలకు సమాదానం చెప్పాలన్నారు. జూన్.. జూలై తర్వాత ప్రాజెక్టులు శరవేగంగా పూర్తవుతాయన్నారు సీఎం కేసీఆర్.

Posted in Uncategorized

Latest Updates