ఆది కొత్త సినిమా లాంచింగ్

AADIశ్రీనివాస నడికట్ల డైరెక్షన్ లో ఆది హీరోగా నటిస్తున్న కొత్త సినిమా మొదలైంది. ఆదివారం (మే-27) హైదరాబాద్ లోని ఫిలింన‌గ‌ర్ దైవ సన్నిధానంలో ఈ మూవీని గ్రాండ్‌గా లాంచ్ చేసింది యూనిట్. చింతలపూడి శ్రీనివాస్, చావలి రామాంజనేయులు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. లాంచింగ్ కార్య‌క్ర‌మంలో వంశీ పైడిపల్లి క్లాప్ కొట్టగా.. డీసీపీ.కృష్ణ మోహన్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. సాయి కుమార్ స్క్రిప్ట్ అందజేయడం జరిగింది. హీరో నాగశౌర్య, వంశి పైడిపల్లి, నిర్మాత భరత్ చౌదరి, సాయి కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సినిమా ప్యూర్ ల‌వ్ స్టోరీ అని చెప్పాడు హీరో ఆది. రెండు షేడ్స్‌లో తాను క‌నిపిస్తున్నాని చెప్పిన ఆది త్వ‌ర‌లో హీరోయిన్ ఎవ‌ర‌నేది ప్ర‌క‌టిస్తామ‌న్నాడు. రాజీవ్ కనకాల, రాధికా, రావు రమేష్, అజయ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని తెలిపిన యూనిట్..సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు.

Posted in Uncategorized

Latest Updates