ఆధార్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు ఉంటే చాలు : మెట్రో స్టేషన్లలో అద్దె బైకులు

METRO BYKES RENTఅత్యవసర పరిస్ధితుల్లో బైక్ కావాలంటే ఇక చిటికిలో పని. ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చాలు. అద్దెకు బైకులు దొరుకుతాయి. హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రయాణికుల సౌలభ్యం కోసం.. అధికారులు ప్రైవేట్‌ భాగస్వామ్యంతో అద్దె బైకులను అందుబాటులోకి తీసుకువచ్చారు. గురువారం (జూలై-5) బేగంపేట్‌ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మెట్రోరైల్‌ MD ఎన్వీఎస్‌ రెడ్డి ఈ సేవలను ప్రారంభించారు. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న డ్రైవ్‌ జీ అనే సంస్థ .. బాలానగర్‌, కూకట్‌ పల్లి, మెట్టుగూడ, తార్నాక స్టేషన్లలో 125 బైక్‌లను అందుబాటులో పెట్టింది. ఈ బైక్‌ ల అద్దె కిలోమీటర్‌కు రూ. 3గా నిర్ణయించారు. దేశంలోనే బైక్‌ లు, కార్లను అద్దెకివ్వడంలో డ్రైవ్‌ జీ కి అతిపెద్ద సంస్థగా పేరుందన్నారు. మొబైల్‌ యాప్‌ ఆధారంగానే అద్దెకు బైకులను సులభంగా పొందవచ్చన్నారు.

ఆధార్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు ఉంటే చాలు.. డ్రైవ్‌జీ మొబైల్‌ యాప్‌ లో పేరు నమోదు చేసుకోవచ్చు. వారం రోజులు, నెల, ఏడాది కాలానికి గాను మెంబర్ షిప్ తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు. మియాపూర్‌ లో ఇప్పటికే జూమ్‌ కార్‌ ద్వారా ఎలక్ట్రిక్‌ అద్దె కార్ల సేవలు అందుబాటులో ఉన్నాయి. పెడల్‌ సంస్థ సైకిళ్లను అద్దెకిస్తోంది. త్వరలో 24 మెట్రో స్టేషన్‌ లలో ఎలక్ట్రిక్‌ కార్ల కోసం చార్జింగ్‌ పాయింట్లు ఏర్పాటు చేస్తాం. ప్రస్తుతం మియాపూర్‌ స్టేషన్‌ లో ఈ సదుపాయం ఉందని వెల్లడించారు.

Posted in Uncategorized

Latest Updates