ఆధార్‌ డేటా సురక్షితం : రవిశంకర్‌ ప్రసాద్‌

ఆధార్‌ సమచారాన్ని (డేటా) సురక్షితంగా ఉంచే విషయంలో కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టంగా వ్యవహరిస్తోందన్నారు ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌. భారత్‌ డిజిటల్‌ శక్తిగా ఎదుగుతున్న నేపథ్యంలో… వ్యక్తిగత సమాచార గోప్యత విషయంలో రాజీ పడేది లేదని శుక్రవారం పార్లమెంటులో స్పష్టం చేశారు. డేటా పరిరక్షణకు సంబంధించి జస్టిస్‌ బి.ఎన్‌.కృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటైన నిపుణుల కమిటీ నివేదిక కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారాయన. పార్లమెంటు ఆమోదించిన –  పటిష్ఠమైన భద్రత ప్రమాణాలు, సమాచార గోప్యత ఉన్న చట్టం పరిధిలోనే ఆధార్‌ ఉందన్నారు రవిశంకర్ ప్రసాద్ . డేటా బహిర్గతం కాకుండా.. ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) కూడా నిరంతరం భద్రత ప్రమాణాలను పెంచుతున్నామని చెప్పారు. అలాగే డేటా వినియోగించిన విషయమై ఫేస్‌బుక్‌, కేంబ్రిడ్జ్‌ ఎనలిటికాలకు ప్రభుత్వం స్పష్టమైన హెచ్చరికలు చేసిందని, అవి క్షమాపణలు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.  ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధిలు కూడా సుపరిపాలనకు ఆధార్‌ చక్కని సాధనంగా పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు మంత్రి.

Posted in Uncategorized

Latest Updates