ఆధార్ అమలుపై మలేసియా ఆసక్తి

ఢిల్లీ: భారత్ లో ప్రవేశ పెట్టిన ఆధార్‌ పై మలేసియా దృష్టి పెట్టింది. ఇలాంటి గుర్తింపు కార్డుల వ్యవస్థనే తమ దేశంలోనూ తీసుకురావాలని భావిస్తోంది మలేసియా ప్రభుత్వం. సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరవేయడంతోపాటు రాయితీల్లో నకిలీలకు చెక్‌ పెట్టడమే లక్ష్యంగా ఈ కార్డులను తీసుకరావాలని యోచిస్తోంది మలేసియా. గత మే నెలలో భారత ప్రధాని మోడీ కౌలాలంపూర్‌లో పర్యటించారు. ఆనాడు ఆధార్‌ గుర్తింపు కార్డులతో సహా పురోగతి సాధించిన భిన్న అంశాల్లో తోడ్పాటు అందిస్తామని మలేసియా ప్రధాని మహాథిర్‌ మొహమ్మద్‌ కు హామీ ఇచ్చారు మోడీ. దీంతో ఆధార్‌ వైపుగా ఇక్కడ తొలి అడుగులు పడినట్లయింది. ఈ మార్పులకు మలేసియా మంత్రివర్గం  ఆమోదం తెలిపింది. ఈ అంశంపై మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు మలేసియా మానవ వనరుల మంత్రి కుల సేగరన్‌ నేతృత్వంలో కేంద్ర బ్యాంకు, ఆర్థిక, మానవవనరుల శాఖల అధికారుల బృందం గతవారం భారత్‌కు వచ్చింది. ఇక్కడి అధికారులు, మంత్రులతో చర్చలు జరిపారు. ‘‘విశిష్ట గుర్తింపు ప్రాధికారసంస్థ(ఉడాయ్‌) సీఈవో అజయ్‌ భూషణ్‌ పాండేను కలిసింది మలేసియా బృందం. మలేసియాలో ఇప్పటికే మైకార్డ్‌గా పిలిచే గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నామని, అయితే ఆధార్‌ లాంటి వ్యవస్థతో మోసాలు, నకిలీలకు ఇట్టే కళ్లెం వేయొచ్చని అభిప్రాయపడ్డారు మలేసియా మానవ వనరుల మంత్రి కుల సేగరన్‌. మలయ్‌ ఆధార్‌ను బ్యాంకు ఖాతాలతో అనుసంధానించే అవకాశముందనీ సూచనలిచ్చారు ఆయన. ఇండియాలో అమలవుతున్నఆధార్ గుర్తింపు కార్డుల వ్యవస్థను మలేసియాలో అమలు చేయడానికి సమాయత్తమవుతుంది అక్కడి ప్రభుత్వం.

Posted in Uncategorized

Latest Updates