ఆధార్ ను డీ- లింక్ చేసే ప్రణాళికను 15 రోజుల్లో ఇవ్వాలి : UIDAI

మొబైల్ నంబర్లతో ఆధార్ కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదని రీసెంట్ గా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దీంతో ఆధార్ ను డీ- లింక్ చేసే ప్రణాళికను 15 రోజుల్లో ఇవ్వాలని యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(UIDAI) టెలికాం సంస్థలను కోరింది.  సుప్రీంకోర్టు తీర్పుతో ఆయా కంపెనీలకు ఉడాయ్ సర్య్కులర్ జారీ చేసింది. అక్టోబర్.15వ తేదీ నాటికి ప్రణాళికలను అందచేయాలని..  మొబైల్ యూజర్స్ ను గుర్తించేందుకు ఆధార్ ఉపయోగించడం ఆపాలని తెలిపింది.

సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇవ్వడానికి కంటే ముందు, ప్రతి టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌ నుంచి జియో వరకు తమ మొబైల్‌ యూజర్ల నుంచి తప్పనిసరిగా ఆధార్‌ను లింక్‌ ప్రక్రియను చేపట్టాయి. కొత్త మొబైల్‌ నెంబర్లకు, పాత నెంబర్లకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు ఆధార్‌ తప్పనిసరి చేశాయి. సుప్రీంకోర్టు టెలికాం కంపెనీలకు షాకిస్తూ.. ఆధార్‌ ధృవీకరణను వాడుకోవద్దంటూ ఆదేశించింది. బ్యాంక్‌ లు కూడా ఆధార్‌ లింక్‌ ను తప్పనిసరి చేయుద్దని తీర్పు వెల్లడించింది. స్కూల్‌ అడ్మినిషన్లకు, CBSE, నీట్‌, UGCలకు కూడా ఆధార్‌ అవసరం లేదని చెప్పింది.

 

Posted in Uncategorized

Latest Updates