ఆధార్ నెంబర్‌ ఇంటర్నెట్ లో పెట్టొద్దు

ఆధార్ నంబర్‌ను ఇంటర్నెట్‌, సోషల్ మీడియాలో పెట్టొద్దని ప్రజలకు సూచించింది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ). ట్రాయ్ చైర్మన్ ఆర్‌ఎస్ శర్మ తన ఆధార్ నెంబర్ ట్విటర్‌లో షేర్ చేసి సవాల్ విసరడంతో ఆయనకు సంబంధించిన వివరాలన్నీ బయటకు వచ్చాయి. ఆ తర్వాత చాలా మంది శర్మలాగే తమ ఆధార్ నెంబర్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ప్రారంభించారు. ఈ సందర్భంలోనే ఈ హెచ్చరిక చేసింది యూఐడీఏఐ. ఇలా మీ ఆధార్ నెంబర్ ఇచ్చి సవాళ్లు విసరకండి అని యూఐడీఏఐ స్పష్టం చేసింది.

బ్యాంక్ అకౌంట్, పాస్‌పోర్ట్, పాన్ నెంబర్లు ఆధార్‌తో అనుసంధానమై ఉంటాయని స్పష్టం చేసింది యూఐడీఏఐ. ఈ వివరాలను ప్రజలు తమ అవసరం మేరకు చట్టపరమైన వాటికే వాడాలని సూచించింది. ఇలాంటి చర్యలకు పాల్పడకుండా.. గోప్యత, భద్రత పాటించాలని సూచించింది.

Posted in Uncategorized

Latest Updates