ఆధార్ లింక్ తో స్పాట్ లో పాన్

AADHAR PAN LINKపాన్ కార్డ్ కావాలంటే నానా రకాల అడ్రస్ ఫ్రూపులు, ఫింగర్ ప్రింట్స్, టెన్త్ సర్టిఫికెట్..ఇలా అన్ని అధారాలు కావాల్సిందే. ఇందులో ఏది మ్యాచ్ కాకపోయినా అప్లికేషన్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలెక్కువ. ఇప్పుడు వీటన్నిటికీ చెక్ పెట్టనుంది పాన్. ఆధార్ లింక్ తో పాన్ కార్డు ఇష్యు చేయనుంది. పర్సనల్, బిజినెస్ అవసరాలరీత్యా తక్షణం పాన్‌ కార్డ్‌లను పొందాలనుకునే వారికోసం ఆదాయపు పన్ను(IT) శాఖ ఇన్‌ స్టంట్‌ ఈ–పాన్‌ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది.

ఫస్ట్ టైమ్ పాన్‌ నంబర్‌ కోసం అప్లై చేసే వ్యక్తులకు ఆధార్‌ తో అనుసంధానమైన కేటాయింపు వ్యవస్థను ప్రారంభించింది. ఆధార్‌ కార్డులు ఉన్నవారెవరైనాసరే ఇన్‌ స్టంట్‌ ఈ–పాన్‌ సేవలను పరిమితకాలంపాటు ఉచితంగా పొందొచ్చు అని తెలిపింది ఐటీ శాఖ. ఈ వ్యవస్థలో పాన్‌ కు దరఖాస్తు చేసిన వారికి. ఆధార్‌ తో లింక్ అయిన మొబైల్‌ నంబర్‌ కు వన్‌ టైమ్‌ పాస్‌ వర్డ్‌(OTP) వస్తుంది. దీన్ని ఎంటర్‌ చేస్తే క్షణాల్లో ఈ–పాన్‌ నంబర్‌ కేటాయింపు పూర్తవుతుంది. ఆధార్‌ లో ఉన్న విధంగానే పేరు, పుట్టిన తేదీ, మొబైల్‌ నంబర్, అడ్రస్‌ ఇతరత్రా వివరాలన్నీ కొత్త పాన్‌ లో పొందుపరుస్తారు అని వివరించింది

వివరాలకు వెబ్ సైట్  www.incometaxindiaefiling.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.

Posted in Uncategorized

Latest Updates