ఆధార్ లింక్ పై బ్యాంకులకు మొట్టికాయలు

ankఆధార్‌ లింక్‌ చేయలేదన్న కారణంతో బ్యాంకు అకౌంట్లు ఎలా రద్దు చేస్తారని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. ఆధార్ పై నమోదైన పిటిషన్లను గురువారం(ఏప్రిల్-12) విచారించిన చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు జడ్జీలు ధర్మాసనం కేంద్రంపై సీరియస్‌ అయింది. ఆధార్‌ తో అకౌంట్‌ ను లింక్‌ చేయకపోతే తమ సొంత నగదునే ప్రజలు విత్‌ డ్రా చేసుకోలేరని ఆవేదన వ్యక్తం చేసింది. ఇతర అధికారిక వాలిడ్‌ డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ, ఆధార్‌ తప్పనిసరి చేయాల్సిన అవసరం ఏంటని  కోర్టు ప్రశ్నించింది. తాము ఆధార్‌పై విచారణ జరిపేంత వరకు ఆధార్‌ లింక్‌ చేపట్టాలని ఇటీవల సుప్రీంకోర్టు తెలిపిన విషయం తెలిసిందే. అయితే కోర్టు తీర్పుని ఖాతరు చేయని బ్యాంకులు ఆధార్‌ లింక్‌ చేయలేదని బ్యాంకు అకౌంట్లను రద్దు చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates