ఆధార్ లేకున్నా నీట్‌కు దరఖాస్తు

neet
ప్రభుత్వం చేపట్టే  సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇతర లావాదేవీలకు ఆధార్ తప్పని సరి చేసింది ప్రభుత్వం. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా MBBS,BDS, ఆయుష్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే  నేషనల్ ఎలిజబులిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (NEET) కు దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ తప్పనిసరి అంటూ ప్రకటించింది. అయితే దేశవ్యాప్తంగా చాలామంది విద్యార్థులకు ఆధార్ లేదు. దీంతో వారందరికి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో విద్యార్థులు ఆన్‌లైన్ దరఖాస్తులో గుర్తింపు కార్డు కాలమ్‌లో ఆధార్‌తోపాటు ఇతర డాక్యుమెంట్లను వేటినైనా ఎంపికచేసుకోవచ్చు. ఆధార్ కాలమ్‌లో మాత్రం ఎన్‌రోల్‌మెంట్ నంబర్ తప్పనిసరిగా వేయాలి. అంటే ఆధార్ లేని విద్యార్థులు దగ్గర్లోని ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్లలో తమ వివరాలు నమోదుచేసుకొని.. సెంటర్‌లో ఇచ్చే ఎన్‌రోల్‌మెంట్ నంబరును తప్పక దరఖాస్తులో నమోదుచేసుకోవాలి. చివరితేదీకి చాలా సమయం ఉండటంతో ఆధార్‌లేని విద్యార్థులు వెంటనే ఎన్‌రోల్ చేసుకోవాలని CBSE తెలిపింది. ఫింగర్ ఫ్రింట్స్ విషయంలో కూడా సడలింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. గరిష్ట వయోపరిమితి విషయంలో ప్రభుత్వ గెజిట్ విడుదలచేసింది కాబట్టి ఆ నిబంధన తప్పక అమలు అవుతుందన్నారు అధికారులు.

Posted in Uncategorized

Latest Updates