ఆధార్ లేని బ్యాంక్ అకౌంట్లు బ్లాక్

bank
ఆధార్ లో లింక్ చేయని బ్యాంకు ఖాతాలను నిలిపివేస్తున్నాయి కొన్ని బ్యాంకులు. బ్యాంకు ఖాతాలకు ఆధార్ తో లింకు చేయాల్సిన అవసరం లేదని ఇటీవల సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. అయినా కొన్ని బ్యాంకులు వినియోగదారులను అకౌంట్లకు ఆధార్ తో అనుసంధానం చేసుకోవాలని చెబుతున్నాయి. అంతేకాదు ఆధార్ తో లింక్ చేయని ఖాతాలను..వినియోగదారులకు తెలియకుండానే వారి అకౌంట్లను బ్లాక్ చేస్తున్నాయి. మరోవైపు ఆయా బ్యాంకు ఉన్నతాధికారులు…అందులో విధులు నిర్వహించే ఉద్యోగులకు ఖాతాలకు..ఆధార్ తో లింకు అయ్యేలా చూడాలని టార్గెట్ ను పెడుతున్నాయి. రోజుకు 15 నుంచి 20 అకౌంట్లకు ఆధార్ అనుసంధానం అయ్యేలా చూడాలని…అలా టార్గెట్ రీచ్ అయిన వారికి ఇన్సెంటివ్, రివార్డ్స్ తో పాటు ప్రమోషన్లు కల్పిస్తున్నారు. దీంతో ఆధార్  లింకు చేయడంలో బిజీ అయ్యారు ఉద్యోగులు.

 

Posted in Uncategorized

Latest Updates