ఆధార్ వర్చువల్ ఐడీ ప్రారంభ తేదీ పొడిగింపు

adaఆధార్ కార్డును మరింత సేఫ్టీగా ఉంచేందుకు అవసరమైన మార్పులు చేపట్టేందుకు సిద్దమైంది UIDAI. జూన్-1 నుంచి  ఆధార్ వర్చువల్ ఐడీని స్టార్ట్ చేయాలని ముందుగా UIDAI నిర్ణయించినప్పటికీ ఇప్పుడు దాన్ని జులై-1 కు పొడిగించారు.వర్చువల్ ఐడీ అమలుకు సర్వీస్‌ ప్రొవైడర్లు, బ్యాంకులు, టెలికం కంపెనీలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర సంస్థలకు జూలై 1 వరకు సమయమిచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం కూడా  వర్చువల్ ఐడీ యొక్క ఉపయోగాలను బలోపేతం చేసేందుకు చర్యలు ప్రారంభించింది. వర్చువల్ ఐడీ అనేది 16 డిజిట్ నెంబర్ తో ఉంటుంది. ఇక నుంచి ఎవరైనా తమకు సంబంధించిన వివరాలు ఎవరికైనా ఇవ్వాలంటే 12 అంకెల ఆధార్ కు బదులుగా 16 అంకెల వర్చువల్ ఐడీని ఉపయోగించుకోవచ్చు.  ఇది డిజిటల్ ఐడీ కార్డు. ఒక వ్యక్తి ఎన్ని కావాల్సి ఉంటే అన్ని ఐడీలను జనరేట్‌ చేసుకోవచ్చు. కొత్త ఐడీ క్రియేట్‌ అయిన ప్రతిసారి పాత ఐడీ ఆటోమేటిక్‌గా రద్దువుతుంది. ఇది 12 అంకెల ఆధార్ కన్నా మరింత సేఫ్టీగా ఉంటుంది.

Posted in Uncategorized

Latest Updates