ఆధ్యాత్మిక గురువు ఆత్మహత్య : ప్రశాంతత గురించి చెప్పే అతనే.. అశాంతికి బలయ్యారు

athమధ్యప్రదేశ్ రాష్ట్రానికి  చెందిన  ఆధ్యాత్మిక  గురూ భయ్యూజీ  మహరాజ్  ఆత్మహత్య చేసుకున్నారు. ఆశ్రమంలో తుపాకీతో  కాల్చుకున్నాడు. స్వామిజీని వెంటనే  ఇండోర్ బాంబే  ఆస్పత్రికి తరలించారు ఆయన శిష్యులు.  అప్పటికే  భయ్యూజీ  మృతి చెందినట్లు  డాక్లర్లు తెలిపారు. భయ్యూజీకి రీసెంట్ గా  నర్మదా నది  ప్రక్షాళన  బోర్డులో భాగంగా.. శివరాజ్ సింగ్  చౌహాన్  సర్కార్  కేబినెట్  హోదా కల్పించింది. దీనిని  భయ్యూజీ  తిరస్కరించారు.  ప్రజలకు  చేరువయ్యేందుకు  పదవులు  అవసరం లేదని ప్రకటించి.. ప్రజలకు మరింత దగ్గర అయ్యారు  భయ్యూజీ.

నిత్యం ప్రజలకు ఆధ్యాత్మికత, ప్రశాంతత గురించి బోధించే వారు భయ్యూజీ. మనస్సు ప్రశాంతంగా ఉండాలని.. ప్రకృతిని ప్రేమించాలని.. అప్పుడే మనస్సు నిర్మలంగా, ప్రశాంతంగా ఉంటుందని భక్తులకు హితబోధ చేస్తుంటారు భయ్యూజీ. అందులో భాగంగా నర్మదా నది ప్రక్షాళన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. నదులు మనిషి మనుగడలో భాగం అని.. వాటిని ప్రేమించాలని ప్రచారం చేశారు. ఎప్పుడూ అహింత, ప్రశాంతత గురించి ప్రసంగిస్తూ.. ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో చెబుతూ ఉంటారు భజ్యూజీ. అలాంటి ఆధ్యాత్మిక గురువే.. మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకోవటం ఆయన భక్తులనే కాకుండా.. మధ్యప్రదేశ్ ప్రజలను నివ్వెరపరిచింది. ఇటీవలే ప్రభుత్వం కేబినెట్ హోదాలో మంత్రి పదవి ఇచ్చినా వద్దన్నారు.

 

Posted in Uncategorized

Latest Updates