ఆధ్యాత్మిక గురువు పులాజీ బాబా కన్నుమూత

ఆదిలాబాద్ : ఆధ్యాత్మిక గురువు పులాజీ బాబా అనారోగ్యంతో చనిపోయారు. మహారాష్ట్ర లోని నాందేడ్ లో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా పులాజీ బాబా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని పాట్నాపూర్ ఆశ్రమంలో బాబా అంత్యక్రియలు బుధవారం జరుగుతాయి.

భక్తులు సందర్శించడానికి బాబా పార్థివ దేహన్ని ఈరోజు ఆశ్రమంలో ఉంచారు. బాబా సేవలను గుర్తించి ఆయన జన్మదిన వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. బాబాకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో భక్తులున్నారు. పులాజీ బాబా మృతితో భక్తులు శోక సంద్రంలో మునిగారు. గతంలోనే పులాజీ బాబా సజీవ సమాధికి పునుకోగా.. భక్తుల ఒత్తిడితో నిర్ణయాన్ని విరమించుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates