ఆన్సర్స్ కి బదులుగా వింత రాతలు : లవ్‌లో పడ్డాను.. పాస్ చేయండి సార్

ilovemypoojaలవ్‌లో పడ్డాను.. పాస్ చేయండి సార్ అని ఓ స్టూడెంట్ తన ఆన్సర్ షీట్ లో రిక్వెస్ట్ చేశాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలే ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయి. పేపర్లు దిద్దుతున్న టీచర్లకు వింత అనుభవాలు ఎదురవుతున్నాయి. ఓ విద్యార్థి తన కెమిస్ట్రీ ఎగ్జామ్ పేపర్లో ఈ విధంగా రాశాడు. ఐ లవ్ మై పూజ అని ఆకర్షణీయంగా పెద్ద అక్షరాలతో రాశాడు. ఈ ప్రేమ చాలా విచిత్రమైనది. ఈ ప్రేమ బతుకనీయదు.. చావనీయదు. ఈ ప్రేమకథ వల్ల పరీక్షలకు చదవలేకపోయాను. మీరే నన్ను పాస్ చేయండి అంటూ ఆ విద్యార్థి వేడుకున్నాడు. ఐ లవ్ మై పూజ పక్కన హార్ట్ సింబల్ గీశాడు.

ఇక మరో విద్యార్థి అయితే ఈ విధంగా రాశాడు. నాకు అమ్మ లేదు. నేను పరీక్షల్లో ఫెయిల్ అయితే మా నాన్న నన్ను చంపేస్తారు అని రాశాడు. ఇంకో విద్యార్థి టీచర్లను హెచ్చరించాడు. మీరు నన్ను ఫెయిల్ చేస్తే ఆత్మహత్య చేసుకుంటాను అని బెదిరించాడు. ఈ ఘటనలపై ముజఫర్‌నగర్ జిల్లా విద్యాధికారి మునేశ్ కుమార్ మాట్లాడుతూ.. కొంతమంది విద్యార్థులైతే తమను పాస్ చేయాలని కోరుతూ పరీక్ష పేపర్ల మధ్య కరెన్సీ నోట్లు పెడుతున్నారని తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates