ఆన్ లైన్లో JEE మెయిన్‌ హాల్‌టికెట్లు

JEE మెయిన్‌ ప్రవేశపరీక్షకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. NIT, ట్రిపుల్‌ ఐటీ,IIT, ఇతర GFTIల్లో ప్రవేశాల కోసం జనవరి 6 నుంచి 20 వరకు ఎంట్రెన్స్ టెస్ట్  నిర్వహించనుంది. దీని కోసం విద్యార్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసునేందుకు  చర్యలు చేపట్టింది. హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు సంబంధించిన లింక్‌ను  ఇవాళ (సోమవారం) నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది.

పరీక్షలను ఆన్‌లైన్‌లో ప్రతి రోజు రెండు షిఫ్ట్‌లుగా నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది. దేశవ్యాప్తంగా 264 నగరాల్లో నిర్వహించే  టెస్ట్ కు 9.65 లక్షల మంది హాజరుకానుండగా…. తెలంగాణ నుంచి దాదాపు 70 వేల మంది హాజరుకానున్నారు. తెలంగాణ విద్యార్థుల కోసం హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి, వరంగల్‌ పట్టణాల్లో NTA పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు ఏటా ఒకసారి మాత్రమే JEE మెయిన్‌ను సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (CBSE) నిర్వహించగా, 2019–20 అకాడమిక్ ఇయర్ లో ప్రవేశాల కోసం ఎన్‌టీఏ ఏటా రెండుసార్లు నిర్వహించేలా షెడ్యూలు జారీ చేసింది. దీనిలో భాగంగా మొదటి విడత పరీక్షను జనవరిలో, రెండో విడత పరీక్షను ఏప్రిల్‌లో నిర్వహించేలా చర్యలు చేపట్టింది.

మొదటి విడత పరీక్షను జనవరి 6 నుంచి 20 వరకు నిర్వహించనుంది. ఆయా తేదీల్లో ప్రతి రోజూ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మొదటి షిఫ్ట్‌ పరీక్ష ఉంటుంది. మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు రెండో షిఫ్ట్‌ పరీక్ష ఉంటుంది. విద్యార్థులను రెండు గంటల ముందు నుంచే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లాల్సిందేనని NTA స్పష్టం చేసింది. ఉదయం పరీక్షకు 8:30 లోపు, మధ్యాహ్నం పరీక్షకు 1:30 లోపు పరీక్ష కేంద్రాల్లో ఉండాల్సిందేనని తెలిపింది.

వెబ్ సైట్: jeemain.nic.in

Posted in Uncategorized

Latest Updates