ఆన్ లైన్ దొంగలు : SBI కాల్ సెంటర్ పేరుతో ఫోన్.. రూ.5కోట్లు కొట్టేశారు

హలో సార్.. హాయ్ సార్.. నేను బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను.. మీ అకౌంట్ అప్ డేట్ చేస్తున్నాం.. మీ డీటెయిల్స్ చెప్పకపోతే మీ అకౌంట్ బ్లాక్ అవుతుంది.. మీకు కొత్త ATM కార్డు జారీ అయ్యింది.. పాత పిన్ నెంబర్ చెప్పండి అప్ డేట్ చేస్తాం.. మేం SBI కాల్ సెంబర్ నుంచి మాట్లాడుతున్నాం అంటూ ఫోన్లు చేసి.. అకౌంట్ల నుంచి డబ్బులు కొట్టేసే ఘరానా ముఠా పట్టుబడింది. ఇప్పటి వరకు ముంబై, గుర్గావ్ ప్రాంతాల్లోనే ఈ తరహా మోసాలు ఎక్కువగా జరిగేయి.. ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగాను ఏర్పడిన 30 మంది సభ్యుల ముఠాను పట్టుకుని కటకటాల్లోకి నెట్టారు పోలీసులు.

కొన్ని రోజులుగా SBI కాల్ సెంటర్ నుంచి అంటూ ఫోన్లు చేసి.. ఖాతాదారుల అకౌంట్ నుంచి సొమ్మును మాయం చేస్తున్నారు. దీనిపై కంప్లయింట్ అందుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు…నిఘా పెట్టారు.  తీగ లాగే కొద్దీ డొంక కదిలింది. 30 మంది ముఠా ఉన్నట్లు గుర్తించారు. అందులో ఎనిమిది మంది పట్టుకున్నారు. వీరిని విచారిస్తే షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటి వరకు 2వేల బ్యాంక్ అకౌంట్లను లూఠీ చేసినట్లు చెప్పారు. అందులో నుంచి 5 కోట్ల రూపాయలు కాజేసినట్లు ఒప్పుకున్నారు. ఇవన్నీ కూడా సామాన్యుల నుంచే. చదువురాని వారి నుంచే. ఒక్కో అకౌంట్ నుంచి వెయ్యి, 2వేలు, 5వేలు ఇలా కాజేసినట్లు చెప్పారు. మరో 22 మంది పరారీలో ఉన్నారని.. వాళ్లందరూ కూడా 23వ తేదీలోపు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు పోలీసులు. లేకపోతే కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. ఈ సైబర్ దోపిడీలో ప్రధానంగా 8 మంది నిందితులు. వారే ముఠాగా ఏర్పడి.. టెలీ కాలర్స్ పేరుతో ఉద్యోగులను నియమించుకుని.. బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బును కొట్టేసేవారు.

గిప్ట్ లు వచ్చాయని.. ఏటీఎం కార్డు బ్లాక్ అయిందని.. బ్యాంక్ అకౌంట్ అప్డేట్ కోసమని.. పిన్ నెంబర్లు, ఓటీపీ నెంబర్లు తెలుసుకుని అకౌంట్ల నుంచి డబ్బులు మాయం చేశారు. ఇదంతా జయశ్రీ డిస్ట్రిబ్యూటర్స్ పేరుతో ట్రాన్స్ ఫర్ అయినట్లు గుర్తించారు. 80లక్షల రూపాయలతో పాటు బ్యాంక్ చెక్కు బుక్కులు, ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates