ఆన్ లైన్ పుడ్ ఆర్డర్ చేయకపోవడం బెటర్.. నమ్రతాశిరోద్కర్

డెలివరీ చేయాల్సిన ఫుడ్డును మధ్యలోనే బండి ఆపి తింటున్న ఓ డెలివరీ బాయ్ వీడియో ఇపుడు వైరల్ అవుతోంది. తాను డెలివరీ చేయాల్సిన ఫుడ్ ఐటమ్స్ కొన్నింటిని ఓపెన్ చేసి.. వాటిని తింటూ.. తిరిగి ప్యాక్ చేసి.. డెలివరీ చేసిన తీరు చూసి.. సిటీ జనాలకు వికారం కలుగుతోంది. అందరూ అలా ఉండకపోయినా… ఒక్కడు చేసిన పని కారణంగా.. టోటల్ ఇండస్ట్రీపైనే నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి.

తెలుగు సినిమా హీరో మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ ఇన్ స్టగ్రామ్ లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసి తాను షాక్ అయ్యానన్నారు. ఇంత మంచి పేరు ఉన్నప్పటికీ… వీళ్లు ఇలా ఎలా బిహేవ్ చేస్తారో అర్థం కావడం లేదన్నారు. నీట్ గా, టేస్టీగా వండుతారనే ఆన్ లైన్ లో ఆర్డర్ చేయడానికి జనం ఇష్టపడతారు.. కానీ ఇంత ఘోరంగా డెలివరీ చేస్తారనుకోలేదు అన్నారు. వీళ్లకు వర్క్ ఎతిక్స్, పద్ధతులు ఉండవా అని ప్రశ్నించారు. ఈ యాప్ ఓపెన్ చేయాలంటేనే రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చిందని.. నా పిల్లలకైతే ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ ఇవ్వొద్దని చెబుతానని చెప్పారు నమ్రతా శిరోద్కర్.

ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఏ నగరంలో తీసింది అనేదానిపై క్లారిటీ లేదు.

Posted in Uncategorized

Latest Updates