ఆన్ లైన్ లోనే ఎఫ్ఐఆర్ : త్వరలో స్మార్ట్ పోలీసింగ్ పోర్టల్


దేశంలో స్మార్టు పోలీసింగ్ విధానం అమలు చేయడానికి కేంద్ర హోం శాఖ సమాయత్తమవుతుంది. పోలీసు బలగాలను ఆధునికీకరించాల్సిన అవసరం ఉందని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరాలకు పాల్పడుతున్న ప్రస్తుత నేర వ్యవస్థను సమర్థంగా ఎదుర్కొనేందుకు స్మార్టు పోలీసింగ్ విధానం ఎంతో అవసరమని భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ విధానం అమలయితే ఇంట్లోనే  కూర్చుని  ఇంటర్నెట్ ద్వారా ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవచ్చు. దీన్ని స్మార్ట్ స్కీమ్ గా పిలుస్తారు. త్వరలో అన్ని రాష్ట్రాల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఏడు రకాల నేరాలు, అందుకు సంబంధించిన సేవలకే ఎఫ్ఐఆర్ నమోదు కోసం కేంద్ర ప్రభుత్వం పౌర పోర్టల్ ను ప్రారంభించనున్నట్లు హోంశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మన ఇంట్లో కొత్తగా పని మనిషి, డ్రైవర్, కిరాయిదారుల వివరాలను సైతం తెలుసుకొనేందుకు ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది. పౌరుల నుంచి అందే ఫిర్యాదులు, ఇతర సమాచారం తక్షణమే ఆయా రాష్ట్రాల, యూటీల పోలీసులకు పంపిస్తారు. ఈ పోర్టల్ ను ప్రజలు వినియోగించుకోవడం వల్ల నేరాలు ఆదుపులో ఉంటాయి. ఇంట్లో దొంగలు పడ్డ, వాహనాన్ని ఎవరైన దొంగిలించిన, ఏ ఇతర కారణంపైననైనా ఇంటి వద్ద నుంచే ఫిర్యాదు చేయవచ్చు. త్వరలోనే ఈ విధానం అందుబాటులోకి రానుంది.

Posted in Uncategorized

Latest Updates