ఆన్ లైన్ లో ఆపరేషన్.. గుండె సర్జరీ చేసిన గుజరాత్ డాక్టర్

గుజరాత్ లో ఓ డాక్టరు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న రోగికి ఇంటర్నెట్ ద్వారా గుండె ఆపరేషన్ చేశాడు. ప్రపంచంలోనే తొలిసారి ఇంటర్నెట్ ద్వారా ఆపరేషన్ చేసిన డాక్టరుగా తేజ్ పటేల్ బుధవారం ఈ ఘనత సాధించారు.  ప్రపంచంలోనే తొలి టెలీ రోబోటిక్‌ కరోనరీ సర్జరీగా ఇది రికార్డుకెక్కింది. హ్యూమన్ రోబోటిక్ ఇటర్‌వెన్షన్‌ విధానంలో తేజ్ పటేల్ రిమోట్‌ ద్వారా ఆపరేషన్‌ చేశారు. ఈ సర్జెరీని గాంధీనగర్‌ లోని అక్షర్‌ధామ్  స్వామి నారాయణ్‌ ఆలయం నుంచి చేశారు. ఆయయం లోని ఓ గదిని థియేటర్ గా మార్చుకుని అందులో నుండి ఆపరేషన్ చేసినట్టు డాక్టర్ తేజ్ తెలిపారు. తనకు దైవ భక్తి ఎక్కువని అందుకే గుడి నుండి సర్జరీ చేసినట్టు చెప్పారు. ఆపరేషన్ చేస్తున్నప్పుడు సీఎం విజయ్ రూపానీ కూడా అక్కడే ఉన్నారు.

Posted in Uncategorized

Latest Updates