ఆపద్ధర్మ ప్రభుత్వాలకు EC నియమావళి విడుదల

కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ (గురువారం) ఎన్నికల నియమావళిని విడుదల చేసింది. కొత్త పథకాలు, కార్యక్రమాలు ప్రారంభించకూడదని రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను ఆదేశించింది. ఆపద్ధర్మ ప్రభుత్వాలకు కూడా ఈ నియ‌మావ‌ళి వ‌ర్తిసుంద‌ని EC తెలిపింది. మళ్లీ కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఎన్నికల నియమావళి అమలులో ఉంటుందని చెప్పింది. ఆపద్ధర్మ సీఎంగా ఉన్న‌వారు విధానపరమైన, కీలక నిర్ణయాలు తీసుకోవద్దని సూచించింది. అనధికారిక కార్యక్రమాలకు ప్రభుత్వ వనరులు వినియోగించరాదని స్పష్టం చేసింది.

దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న విధానాలను ఆధారంగా చేసుకుని ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక మైన నియమావళిని విడుదల చేసింది. సాధారణంగా అయితే ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసినప్పటి నుంచి అమల్లో ఉంటుంది. ఆపద్ధర్మ ప్రభుత్వాలు ఉన్న దగ్గర ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో ఆపద్ధర్మ ప్రభుత్వం కానీ ఓటర్లను ఆకర్షించే విధంగా కొత్త విధివిధానాలు ప్రకటించడం గానీ, విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవడమైనా ఎన్నికల నియమావళి పరిధిలోకి వస్తాయని తెలిపింది. నియమావళి ప్రకారం కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఎలాంటి ప్రకటన చేయరాదని ఈసీ లేఖలో తెలిపింది.

Posted in Uncategorized

Latest Updates