ఆపరేషన్ కమల్ : క్యాంప్ నుంచి ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మిస్సింగ్

Taj-krishnaవిశ్వాస పరీక్షలో నెగ్గడమే లక్ష్యంగా ఆపరేషన్ కమల్ కు తెరలేపింది బీజేపీ. కాంగ్రెస్-JDS ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతోంది. బలపరీక్షలో విజయం సాధించాలంటే 8మంది ఎమ్మెల్యేలు బీజేపీకి అవసరం కాగా… కాంగ్రెస్-JDSల నుంచి వారిని ఆకర్షించే ప్రయత్నాల్లో ఉంది. ఆల్రెడీ కొందరు ఎమ్మెల్యేలు బీజేపీ గూటికి చేరినట్టు తెలుస్తోంది.

హోస్పేట కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్… కనిపించకుండా పోయారు. వ్యక్తిగత పనులపై ఆయన ఢిల్లీ వెళ్లారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అయితే కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్, గాలి జనార్ధన్ రెడ్డిలకు ఆయన అత్యంత ఆప్తుడు. గతంలో యడ్యూరప్ప ప్రభుత్వంలోనే మంత్రిగానూ పనిచేశారు. బీజేపీలో చేరేందుకే ఢిల్లీ వెళ్లారనే భావన వ్యక్తమవుతోంది. ఇక మస్కి ఎమ్మెల్యే ప్రతాప్ గౌడ కూడా రిసార్ట్ కు తిరిగిరాలేదు. ఆరోగ్యం బాగాలేదని రిసార్ట్ నుంచి బయటకు వచ్చిన హుమ్నాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజశేఖర్ పాటిల్ కూడా అందుబాటులో లేకుండా పోయారు. వీళ్ల ఫోన్లు స్విచ్ఛాఫ్ అని వస్తున్నాయి. కాంగ్రెస్ లోని కొందరు లింగాయత్ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.ఎమ్మెల్యేలు వెంకట్రావ్ నాడగౌడ, మహంతేశ్ కౌజల్గి, అమరేగౌడ, డీఎస్ హులగేరి లతో బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. వీరితో పాటు వెంకటరమణప్ప, శివశంకర్ రెడ్డి, కర్ణాటక ప్రజ్ఞావంత జనతాపార్టీ ఎమ్మెల్యే R.శంకర్, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే నాగేశ్ లను ఆకర్షించే ప్రయత్నాల్లో ఉంది కమలదళం.

ఈ పరిణామాలన్నింటిపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చర్చించారు JDS అధ్యక్షుడు దేవేగౌడ. బీజేపీకి వ్యతిరేకంగా చేపట్టాల్సిన కార్యాచరణ, రాజ్యాంగ, చట్టపరమైన అంశాలపై ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారు. కుమారస్వామి కూడా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ లతో ఫోన్ లో మాట్లాడారు. తిరుమలకు వెళ్లిన దేవేగౌడ కూడా చంద్రబాబుతో ఫోన్ లో మాట్లాడినట్టు సమాచారం.

Posted in Uncategorized

Latest Updates