ఆప్ తరుపున ఎన్నికల బరిలో శత్రుఘ్నసిన్హా, యశ్వంత్‌ సిన్హా

వెస్ట్‌ ఢిల్లినుంచి తమ పార్టీ తరఫున పోటీ బీజేపీ అసమ్మతి నేత శత్రుఘ్న సిన్హాకు ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఆహ్వానించింది. అయితే తాను పాట్నానుంచే పోటీ చేస్తానని శత్రుఘ్న సిన్హా స్పష్టం చేశారు. బీజేపీకి చెందిన మరొక అసమ్మతి నేత యశ్వంత్‌ సిన్హాను న్యూఢిల్లి లోక్‌సభ స్థానానికి పోటీ చేయాల్సిందిగా ఆప్‌ ఆహ్వానించింది. దీనికి సంబంధించి ఇప్పటికే వీరిద్దరితో సంప్రదింపులు జరిపినట్లు ఆప్ పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత స్పష్టం చేశారు.

గతంలో వాజ్‌పేయీ మంత్రివర్గంలో కీలక బాధ్యతలు నిర్వహించిన యశ్వంత్‌, ప్రధాని మోడీ, అమిత్‌ షాలపై విమర్శల వర్షం గుప్పిస్తున్నారు.

మరోవైపు గత కొంత కాలంగా అధికార పార్టీ బీజేపీ నేతలపై శత్రుఘ్న సిన్హా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాఫెల్‌ ఒప్పందంపై కూడా మోడీ ప్రభుత్వాన్ని ఆయన బహిరంగంగానే నిలిదీశారు.

Posted in Uncategorized

Latest Updates