ఆఫీసర్ టీజర్ కు టైమ్ ఫిక్స్

nagarjunaసెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ నాగార్జునతో రూపొందిన‌ చిత్రం ఆఫీస‌ర్‌. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా యాక్ష‌న్ డ్రామాతో తెర‌కెక్కిన ఈ చిత్రం ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతుంది. మే 25న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ చిత్ర టీజ‌ర్ ఏప్రిల్ 9న ఉద‌యం 10గం.ల‌కి విడుద‌ల కానుంద‌ని ఆర్జీవి త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట‌ర్ ద్వారా తెలిపాడు. చిత్ర షూటింగ్ మొత్తం ముంబైలోనే జరిగింది. మైరా స‌రీన్ అనే కొత్త అమ్మాయి ఈ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. కంపెనీ బేన‌ర్‌పై వ‌ర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. 28 ఏళ్ళ క్రితం వ‌చ్చిన శివ చిత్రంతో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన వ‌ర్మ‌- నాగ్ కాంబినేష‌న్ ఆఫీస‌ర్ చిత్రంతో మ‌రో అద్భుతం క్రియేట్ చేయనున్నారని చిత్ర పరిశ్రమ అభిప్రాయ పడుతుంది. రామ్ గోపాల్ వ‌ర్మ‌, నాగార్జున కాంబినేష‌న్‌లో వచ్చిన గోవిందా గోవిందా, అంతం చిత్రాలు భారీ విజ‌యం సాధించాయి. అలాగే ఈ సినిమా కూడా విజయం సాధిస్తుందంటున్నాడు వర్మ.

Posted in Uncategorized

Latest Updates