ఆఫీసర్ టీజర్ : మొదలు పెట్టిన పనిని పూర్తి చేయడం నా బాధ్యత

OFFICERరామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సినిమా ఆఫీసర్. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను సోమవారం (ఏప్రిల్-9)న ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశాడు వర్మ. నిమిషం ఆరు సెకన్లున్న ఈ టీజర్ మొదలు పెట్టిన పనిని పూర్తి చేయడం నా బాధ్యత అని నాగ్ డైలాగ్ చెప్పాడు. హైదరాబాద్ నుంచి ముంబయి వచ్చి మనల్ని పీకుతాడా అని విలన్ డైలగ్ చెబుతాడు. టీజర్ చూస్తుంటే వ‌ర్మ మార్క్ క‌నిపిస్తుంది.  షూటింగ్ మొత్తం ముంబైలోనే జ‌రిగినట్టు, కిడ్నాప్ అయిన పాపని రక్షించే క్రమంలో ఈ మూవీ తెర‌కెక్కిన‌ట్టు తెలుస్తోంది.

చాలా రోజులు తరువాత నాగార్జునను ఓ సీరియస్‌ రోల్‌లో చూపించాడు దర్శకుడు. వర్మ మార్క్‌ యాక్షన్ సీన్స్‌, కెమెరా వర్క్‌తో ఆఫీసర్‌ టీజర్‌ ఆసక్తికరంగా ఉంది. నాగ్ సరసన మైరా స‌రీన్ అనే కొత్త అమ్మాయి ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయం కానుంది. కంపెనీ బ్యానర్ పై వ‌ర్మ నిర్మిస్తున్న ఈ సినిమా మే 25న రిలీజ్ కానుంది. రామ్ గోపాల్ వ‌ర్మ‌, నాగార్జున కాంబినేష‌న్‌ లో  వచ్చిన శివ, గోవిందా గోవిందా, అంతం  భారీ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే.

 

Posted in Uncategorized

Latest Updates