ఆఫ్గానిస్థాన్ పై బంగ్లాదేశ్ గ్రాండ్ విక్టరీ

  • చెలరేగిన బంగ్లా ఆల్ రౌండర్ షకీబ్‌‌ 
  • మోర్తజా సేన సెమీస్ ఆశలు సజీవం

విజయాల కోసం టైటిల్‌‌ ఫేవరెట్లు ఫీట్లు చేస్తుంటే..  అండర్‌‌డాగ్‌‌ బంగ్లాదేశ్‌‌ మాత్రం చాపకింద నీరులా దూసుకొస్తోంది. కెరీర్‌‌ బెస్ట్‌‌ ఫామ్‌‌లో ఉన్న షకీబల్‌‌హసన్‌‌ మరోసారి ఆల్‌‌రౌండ్‌‌ షో చేయడంతో పసికూన అఫ్గానిస్థాన్‌‌పై కీలక విజయం సాధించింది. అఫ్గాన్‌‌పై  పంజా విసిరిన బంగ్లా పులులు సెమీస్‌‌ రేస్‌‌లో తామింకా ఉన్నామంటూ సమీప ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపారు.  తాము  సెమీస్‌‌ రేసులో లేము.. బంగ్లాదేశ్‌‌ను కూడా ముందుకెళ్లకుండా అడ్డుకుంటామన్న పఠాన్లకు  మరోసారి ‘ఏడు’పే మిగిలింది.

సౌతాంప్టన్‌‌: స్టార్‌‌ ఆల్‌‌రౌండర్‌‌ షకీబల్‌‌ హసన్‌‌ (51, 5/29) ఆల్​రౌండ్​ షో ఒంటిచేత్తో బంగ్లాదేశ్‌‌కు మరో విజయాన్ని అందించాడు. తొలుత బ్యాట్‌‌తో తర్వాత బాల్‌‌తో సత్తా చాటి తానెంత విలువైన ఆటగాడో క్రికెట్‌‌ ప్రపంచానికి చాటి చెప్పాడు.  షకీబ్‌‌ ఆల్‌‌రౌండ్‌‌ షోతో చెలరేగడంతో సోమవారం  జరిగిన మ్యాచ్‌‌లో 62 పరుగుల తేడాతో అఫ్గానిస్థాన్‌‌ను చిత్తు చేసిన బంగ్లా టోర్నీలో  మూడో విజయంతో సెమీస్​ అవకాశాలు సజీవంగా ఉంచుకుంది. ఇప్పటికే నాకౌట్‌‌ అయిన అఫ్గాన్‌‌ వరుసగా ఏడో ఓటమి చవిచూసింది.  టాస్‌‌ ఓడి ఫస్ట్‌‌ బ్యాటింగ్‌‌ చేసిన బంగ్లాదేశ్‌‌ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 262 రన్స్‌‌ చేసింది.   ముష్ఫికర్‌‌ రహీమ్‌‌(87 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌‌తో 83),  షకీబల్‌‌ హసన్‌‌ (69 బంతుల్లో 1ఫోర్‌‌తో 51) హాఫ్‌‌ సెంచరీలతో రాణించారు. ఛేజింగ్‌‌లో అఫ్గానిస్థాన్‌‌  47 ఓవర్లలో 200 రన్స్‌‌కే ఆలౌటైంది. సమియుల్లా షెన్వారి(51 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌‌తో 49 నాటౌట్‌‌) టాప్‌‌స్కోరర్‌‌. బౌలర్లలో షకీబ్‌‌కు తోడుగా ముస్తాఫిజుర్‌‌ (2/32) రెండు వికెట్లు తీశాడు. షకీబ్‌‌ మ్యాన్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌గా ఎంపికయ్యాడు.

షకీబ్‌‌ స్పిన్‌‌కు అఫ్గాన్‌‌ విలవిల

ఛేజింగ్‌‌లో ఏదశలోనూ అఫ్గాన్‌‌ లక్ష్యం దిశగా సాగలేదు. బంగ్లా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌‌ చేయడంతో అఫ్గాన్‌‌ వీరులు పరుగులు చేయడానికి నానాపాట్లు పడ్డారు.25.2 ఓవర్లకు కానీ అఫ్గాన్‌‌ వంద పరుగుల మార్కు అందుకోలేకపోయింది. కెప్టెన్‌‌ గుల్బదిన్‌‌ నైబ్‌‌(75 బంతుల్లో 3ఫోర్లతో 47)  28వ ఓవర్లు పాటు క్రీజులో  ఉన్నా  ప్రయోజనం లేకపోయింది. లెఫ్టామ్‌‌ స్పిన్నర్‌‌ షకీబ్‌‌ అఫ్గాన్‌‌ బ్యాట్స్‌‌మెన్‌‌ను వణికించాడు.  తొలి వికెట్‌‌కు 49 రన్స్‌‌ జోడించిన నైబ్‌‌, రెహ్మత్‌‌ షా(24) మంచి పునాదే వేసినా.. షకీబ్‌‌ బౌలింగ్‌‌కు రాగానే ఆ జట్టు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 11వ ఓవర్‌‌లో రెహ్మత్‌‌ను ఔట్‌‌ చేసిన షకీబ్‌‌ బంగ్లాకు తొలి బ్రేక్‌‌ అందించాడు.  మొసాద్దెక్‌‌ బౌలింగ్‌‌లో హష్మతుల్లా(11) స్టంపౌటై రెండో వికెట్‌‌గా వెనుదిరిగాడు. అస్గర్‌‌ అఫ్గాన్‌‌ (20)తో కలిసి నైబ్‌‌ ఇన్నింగ్స్‌‌ను గాడిలో పెట్టే ప్రయత్నం చేశాడు. కానీ, 29వ ఓవర్‌‌ తొలి బంతికి నైబ్‌‌ను, మూడో బంతికి మహ్మద్‌‌ నబీ(0)ని పెవిలియన్‌‌ చేర్చిన షకీబ్‌‌.. కాసేపటికే అస్గర్‌‌ అఫ్గాన్‌‌  వికెట్‌‌ను కూడా ఖాతాలో వేసుకొని మ్యాచ్‌‌ను వన్‌‌సైడ్‌‌ చేశాడు.  అయితే షెన్వారి, నజిబుల్లా(23) ఏడో వికెట్‌‌కు 56 పరుగులు జోడించి బంగ్లా బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. కానీ 44వ ఓవర్‌‌లో నజిబుల్లా జద్రాన్‌‌ (23)ను పెవిలియన్‌‌ చేర్చిన షకీబ్‌‌ ఐదో వికెట్‌‌ ఖాతాలో వేసుకున్నాడు. కాసేపటికే రషీద్‌‌(2), దౌలత్‌‌(0), ముజీబ్‌‌(0)ను పెవిలియన్‌‌ చేర్చిన బంగ్లా బౌలర్లు మ్యాచ్‌‌ ఫినిష్‌‌ చేశారు.

ముష్ఫికర్‌‌ పోరాటం

పటిష్ట ఆస్ట్రేలియాపై వన్డేల్లో తమ బెస్ట్‌‌ స్కోరు నమోదు చేసిన బంగ్లా.. సెమీస్‌‌ రేసులో నిలవాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్‌‌లో ఆ రేంజ్‌‌లో బ్యాటింగ్‌‌ చేయలేకపోయింది. కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ అఫ్గాన్‌‌ బౌలర్లు ఒత్తిడి పెంచగా..   ముష్ఫికర్‌‌ రహీమ్‌‌, షకీబ్​ బాధ్యతగా ఆడడంతో కాపాడుకునే స్కోరు చేయగలిగింది. టాస్‌‌ ఓడి ఫస్ట్‌‌ బ్యాటింగ్‌‌కు దిగిన బంగ్లాకు ఐదో ఓవర్‌‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌‌ లిటన్‌‌దాస్‌‌(16)ను పెవిలియన్‌‌ చేర్చి ముజీబ్‌‌ షాకిచ్చాడు. మరో ఓపెనర్‌‌  తమీమ్‌‌ ఇక్బాల్‌‌(36), ఇన్‌‌ఫామ్‌‌ బ్యాట్స్‌‌మన్‌‌ షకీబ్‌‌ ఇన్నింగ్స్‌‌ను ముందుకు తీసుకెళ్లారు. కానీ, 17వ ఓవర్‌‌లో తమీమ్‌‌ను ఔట్‌‌ చేసిన నబీ ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని వీడదిశాడు.  ఈ దశలో క్రీజులోకి వచ్చిన ముష్ఫికర్‌‌, షకీబ్‌‌తో కలిసి స్ట్రయిక్‌‌ రొటేట్‌‌ చేస్తూ స్కోరు వేగం పెంచే ప్రయత్నం చేశాడు.  వీరిద్దరూ మూడో వికెట్‌‌కు 61 రన్స్‌‌ జోడించారు. ఈ దశలో మరోసారి బంతిని అందుకున్న ముజీబ్‌‌ వరుస ఓవర్లలో షకీబ్‌‌, సౌమ్య సర్కార్‌‌(3) వికెట్లు తీసి అఫ్గాన్‌‌కు డబుల్‌‌ బ్రేక్‌‌ ఇచ్చాడు. అయినా పట్టువిడవని ముష్ఫికర్‌‌..  మొహ్మదుల్లా(27)తో కలిసి  జట్టు స్కోరును 200 మార్కు దాటించాడు.  హాఫ్‌‌ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. 43వ ఓవర్‌‌లో మొహ్మదుల్లాను నైబ్‌‌ ఔట్‌‌ చేసినా..  చివర్లో మొసాద్దెక్‌‌ హుస్సేన్‌‌ (24 బంతుల్లో 4 ఫోర్లతో 35) ధాటిగా ఆడి స్కోరు 250 దాటించాడు.

స్కోర్‌‌బోర్డ్‌‌

బంగ్లాదేశ్‌‌ : లిటన్‌‌  (సి) హష్మతుల్లా (బి) ముజీబ్‌‌ 16, తమీమ్‌‌ (బి) నబీ 36, షకీబ్‌‌ (ఎల్బీ) ముజీబ్‌‌ 51, ముష్ఫికర్‌‌ (సి) నబీ(బి) జద్రాన్‌‌ 83, సౌమ్య సర్కార్‌‌ (ఎల్బీ) ముజీబ్‌‌ 3, మొహ్మదుల్లా (సి) నబీ (బి) నైబ్‌‌ 27, మొసాద్దెక్‌‌ (బి) నైబ్‌‌ 35, సైఫుద్దీన్‌‌ (నాటౌట్‌‌) 2 ; ఎక్స్‌‌ట్రాలు : 9 ; మొత్తం : 50 ఓవర్లలో 262/7 ; వికెట్ల పతనం : 1–23, 2–82, 3–143, 4–151,  5–207, 6–251, 7–262 ;  బౌలింగ్‌‌: ముజీబ్‌‌ 10–0–39–3, దౌలత్‌‌ జద్రాన్‌‌ 9–0–64–1, నబీ 10–0–44–1, నైబ్‌‌ 10–1–56–2, రషీద్‌‌ 10–0–52–0, రహ్మత్‌‌ షా 1–0–7–0.

అఫ్గానిస్థాన్‌‌ : నైబ్‌‌ (సి) లిటన్‌‌  (బి) షకీబ్‌‌ 47, రహ్మత్‌‌ షా (సి) తమీమ్‌‌ (బి) షకీబ్‌‌ 24, హష్మతుల్లా (స్టంప్డ్‌‌) ముష్ఫికర్‌‌ (బి) మొసాద్దెక్‌‌ 11, అస్గర్‌‌ అఫ్గాన్‌‌ (సి) సబ్‌‌/ షబ్బీర్‌‌ రహ్మాన్‌‌  (బి) షకీబ్‌‌ 20, నబీ (బి) షకీబ్‌‌ 0, షెన్వారి (నాటౌట్‌‌) 49, ఇక్రమ్‌‌ (రనౌట్‌‌) 11, నజిబుల్లా (స్టంప్డ్‌‌) ముష్ఫికర్‌‌ (బి) షకీబ్‌‌23, రషీద్‌‌ఖాన్‌‌ (సి) మోర్తజా (బి)ముస్తాఫిజుర్‌‌ 2, దౌలత్‌‌ (సి) ముష్ఫికర్‌‌ (బి) ముస్తాఫిజుర్‌‌ 0, ముజీబ్‌‌ (బి) సైఫుద్దీన్‌‌ 0; ఎక్స్‌‌ట్రాలు : 13 ; మొత్తం: 47 ఓవర్లలో 200 ఆలౌట్‌‌; వికెట్ల పతనం : 1–49, 2–79, 3–104, 4–104, 5–117, 6–132, 7–188, 8–191, 9–195, 10–200 ; బౌలింగ్‌‌ : మోర్తజా 7–0–37–0,  ముస్తాఫిజుర్‌‌ 8–1–32–2, సైఫుద్దీన్‌‌ 8–0–33–1, షకీబ్‌‌ 10–1–29–5,  మెహిదీ హసన్‌‌ 8–0–37–0, మొసాద్దెక్‌‌ 6–0–25–1.

Latest Updates