ఆఫ్రికా దేశాల్లో మరో వికెట్ ఔట్ : అధ్యక్ష పదవికి జాకోబ్ రాజీనామా

South Africa's former Deputy President Jacob Zuma addresses supporters outside the court in Pietermaritzburg September 20, 2006. A South African judge on Wednesday threw out corruption charges against Zuma, boosting the popular politician's bid to succeed President Thabo Mbeki. NO SALES NO ARCHIVES  REUTERS/Stringer  (SOUTH AFRICA) (Newscom TagID: rtrltwo013517.jpg) [Photo via Newscom]
South Africa’s former Deputy President Jacob Zuma addresses supporters outside the court in Pietermaritzburg September 20, 2006. A South African judge on Wednesday threw out corruption charges against Zuma, boosting the popular politician’s bid to succeed President Thabo Mbeki. NO SALES NO ARCHIVES REUTERS/Stringer (SOUTH AFRICA) (Newscom TagID: rtrltwo013517.jpg) [Photo via Newscom]
దక్షిణాఫ్రికా అధ్యక్షడు జాకోబ్‌ జుమా తన పదవికి రాజీనామా చేశాడు. బుధవారం(ఫిబ్రవరి14) సాయంత్రం తన నిర్ణయాన్ని ఆయన ప్రకటించారు. జాతిని ఉద్దేశించి చేసిన  ప్రసంగంలో జుమా మాట్లాడుతూ… తన రాజీనామాకు దారితీసిన పరిస్థితులను వివరించారు.

ఆరోపణలు, అవినీతితో దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశాడని జాకోబ్‌ జుమాపై ఆరోపణలు రుజువు అయ్యాయి.  భారీ అవినీతి, దేశ ఆర్థిక మందగమనం, రికార్డు స్థాయిలో పెరిగిన నిరుద్యోగం తదితర కారణాలు జుమాపై వ్యతిరేకత ఎక్కువ కావటానికి కారణాలు అయ్యాయి. ఈ పరిణామాలతో ఆయన స్వచ్ఛందంగా పదవి నుంచి దిగిపోవాలని అధికార ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌(ANP) కోరింది. అయితే అందుకు ఆయన నిరాకరించటంతో సోమవారం ANP అత్యున్నత స్థాయి భేటీ నిర్వహించి, వెంటనే ఆయన్ని రీకాల్‌ చేయాలని తీర్మానించింది. రాజీనామా చేయకపోతే పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని హెచ్చరించడంతో, దిగొచ్చిన జుమా తన రాజీనామా నిర్ణయాన్ని బుధవారం ప్రకటించారు. దీంతో డిప్యూటీ ప్రెసిడెంట్‌ సిరిల్‌ రామాఫోసా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. మరోపక్క ప్రభుత్వాన్ని, పార్లమెంట్‌ను రద్దుచేసి వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

Posted in Uncategorized

Latest Updates