ఆఫ్రికా ముత్యం ఉగాండా : మోడీ

ఉగాండా  ప్రజల నుద్దేశించి  పార్లమెంట్ లో  ప్రసంగించారు  ప్రధాని నరేంద్ర మోడీ.  ఉగాండాను  ఆఫ్రికా  ముత్యంతో  పోల్చారు. సహజ వనరుల  నిలియమని.. సాంస్కృతిక  వారసత్వానికి  నిదర్శనమన్నారు. ఒకప్పుడు  స్వతంత్రం  కోసం  పోరాడిందని… ఇపుడు  యువశక్తితో  కదం  తొక్కుతోందన్నారు.  ఉగాండాకు  భారత్ తో  పోలికలు  ఉన్నాయన్నారు.  స్వతంత్ర పోరాటంలో  భారత్  ప్రపంచానికి  దారి  చూపించిందని… స్వేచ్ఛ,  గౌరవం,  సమానత్వం  కోసం  ఎలా పోరాడాలో  చూపించిందన్నారు. ఆఫ్రికాలో కన్నా ఎక్కువగా మరెక్కడా వీటి అమలు జరగలేదన్నారు. విద్యుత్  వ్యవసాయం, డైరీ రంగాల్లో పెట్టుబడుల కోసం ఉగాండాకు 200 మిలియన్  డాలర్ల ఆర్థిక  సాయానికి  హామీ ఇచ్చారు. ఆఫ్రికా భాగస్వామి అయినందుకు భారత్ గర్వంగా ఫీల్ అవుతుందని మోడీ అన్నారు. భారత్ ప్రేయారిటీల్లో ఆఫ్రికా ఎప్పుడూ మెదటిస్ధానంలో ఉంటుందన్నారు. ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టేందుకు భారత్ ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తామని మోడీ తెలిపారు. ప్రపంచంలోని 60 శాతం వ్యవసాయ అనుకూలమైన భూమి ఆఫ్రికాలో ఉందని, కానీ ప్రపంచ ఔట్ పుట్ లో కేవలం 10 శాతం మాత్రమే ఆఫ్రికా ప్రొడ్యూస్ చేయగల్గుతుందని మోడీ అన్నారు. ఆఫ్రికా వ్యవసాయాన్ని డెవలప్ చేసేందుకు భారత్ సహకరిస్తుందని మోడీ అన్నారు.

Posted in Uncategorized

Latest Updates