ఆమెకు పల్లీలే ఆహారం


జగిత్యాల: నలబై ఏళ్ల నుంచి కేవలం పల్లీలు(వేరు సెనగలు) తింటూనే బతుకుతుంది ఓ 70 ఏళ్ల వృద్ధురాలు.జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతాపూర్ గ్రామానికి చెందిన ఖాజాబీ అన్నానికి బదులు పల్లీ గింజలు తింటూనే జీవిస్తుంది. ఆమెకు ఏలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా హాయిగా ఉంది.

ఖాజాబీకి చిన్నతనంలోనే పెళ్లి చేశారు తల్లిదండ్రులు. ఆమెకు పెళ్లి ఇష్టం లేకపోవడంతో కాపురానికి పోకుండా పుట్టింటిలోనే ఉంది. నలబై ఏళ్ల క్రితం ఖాజాబీ తల్లి ఆహారం లేదు పల్లీలు తిని బతుకని ఆమెను మందలించింది. పేదరికం వల్ల ఇంట్లో వంట చేయకపోవడం వల్ల ఖాజాబీ తల్లి ఆ విధంగా మాట్లాడింది. కానీ కూతురుపై కోపంతో కాదు. అప్పటి నుంచి ఖాజాబీ మాత్రం పల్లీలే తింటుంది. ప్రస్తుతం ఖాజాబీ వయస్సు 70 ఏళ్లు. ఆమె బీడీలు చుడుతుంది. బీడీలు చుట్టగా వచ్చే సొమ్ముతో ఆమె తనకు ఏడాదికి సరిపోయే పల్లీలు కొంటుంది. పల్లీలు తప్ప తాను మరేమి తినను అని చెపుతుంది ఖాజాబీ.

Posted in Uncategorized

Latest Updates