ఆమె మ‌న‌ల్ని వ‌దిలి ఎందుకు వెళ్లిందో: బాలకృష్ణ,నాగార్జున

sreedevi-bala-krishna-nagarjunaసీనియ‌ర్ న‌టి శ్రీ‌దేవి మ‌ర‌ణం భార‌తీయ సినీ ఇండస్ట్రీకి తీరని లోటన్నారు సీని ప్రముఖులు. ఆమె హఠాన్మరణం చాలా బాధాకరమన్నారు సినీ నటుడు నందమూరి బాలకృష్ణ. శ్రీదేవితో కలిసి.. నాన్నగారు ఎన్నో సినిమాల్లో నటించారని చెప్పారు. ఎలాంటి భావాన్నైనా కళ్లతోనే పలికించగలిగిన మహానటి ఆమె అని అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని వేడుకుంటున్నానని తెలిపారు.

శ్రీ‌దేవి ఆక‌స్మికంగా మ‌న‌ల్ని వ‌దిలి ఎందుకు వెళ్లిందో అర్ధంకావ‌డం లేద‌న్నారు నటుడు అక్కినేని నాగార్జున అన్నారు. ఆమె హ‌ఠాన్మ‌ర‌ణం త‌న‌ను షాక్ గురిచేసింద‌న్నారు. అసలు ఎందుకు వెళ్లిందో అనే విష‌యం గురించే ఆలోచిస్తున్నాన‌ని చెప్పారు.ఆమె మరణం అనేది ఆమెకు సంబంధించిన ఒక చెడు కల లేదా చెడు జ్ఞాపకంగానే భావిస్తానని చెప్పారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ‘మేమంతా మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాం శ్రీదేవి’ అంటూ ట్వీట్ చేశారు నాగ్.

Posted in Uncategorized

Latest Updates