ఆయనకు గుర్తుగా ట్రాఫిక్ సిగ్నల్స్

ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగు లైట్లు సర్వసాధారణం. అయితే జర్మనీ ఫ్రైడ్‌బర్గ్ పట్టణంలో వినూత్న తరహాలో సిగ్నల్‌‌‌‌‌‌‌‌ లైట్లు కనిపిస్తున్నాయి. డాన్సుస్టెప్పుల నమూనాలతో లైట్లను ఏర్పాటు చేయించారు అక్కడి అధికారులు. పాదాచారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇంతకీ ఆ సిగ్నేచర్‌‌‌‌‌‌‌‌ మూమెంట్స్ ఎవరివో తెలుసా?. ‘రాక్‌ అండ్‌ రోల్‌‌‌‌‌‌‌‌’ దిగ్గజం ఎల్విస్‌ ప్రెస్లేకు సంబంధించినవి.అమెరికన్ నటుడు, సింగర్‌‌‌‌‌‌‌‌ అయిన ఎల్విస్‌ పాప్‌ మ్యూజిక్‌తో కూడా తనదైన ముద్ర వేసుకున్నాడు.36 ఏళకే గ్రామీలైఫ్ టైమ్ అచీవ్‌‌‌‌‌‌‌‌మెంట్ అవార్డు పొంది చరిత్ర సృషించాడాయన.ఎల్విన్ అమెరికా సైన్యంలో పని చేసినప్పుడు రెండేళ్ల పాటు ఫ్రైడ్‌బర్గ్ లో ఉన్నాడు.‌‌‌‌‌‌ ఆ సమయంలో కూడా ఆయన పలు ప్రదర్శనలు ఇచ్చాడు. దీంతో ఆ టౌన్‌కి ఎల్విస్ కు ప్రత్యేకమైన బంధం ఏర్పడింది. అందుకే గౌరవార్థం ఈ సిగ్నల్స్‌ను ఏర్పాటు చేయించారు. ఇందుకు గానూ వెయ్యి డాలర్లు ఖర్చయినట్లు  చెప్పారు పోలీసులు.

Posted in Uncategorized

Latest Updates