ఆయిల్ కంపెనీలతో కేంద్రం : పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచొద్దు

petrolపెట్రోల్, డీజిల్ రేట్లను ప్రస్తుతానికి పెంచొద్దని.. కొన్నాళ్లు ఓపిక పట్టాలని దేశంలోని ఆయిల్ కంపెనీలను కోరింది కేంద్రం. రోజువారీగా పెంచుతున్న ధరలను ఆపాలని రిక్వెస్ట్ చేసింది. అంతర్జాతీయ ముడి చమురు ధరలకు అనుగుణంగా.. దేశంలో రోజువారీగా పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు ఉంటున్నాయి. కొన్నాళ్లుగా ఇంధన ధరలు బాగా పెరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.78.50, లీటర్ డీజిల్ రూ.70.50 ఉంది. దేశచరిత్రలోనే ఫస్ట్ టైం డీజిల్ రూ.70 క్రాస్ చేయటం ఇదే.

రోజువారీ ధరల పెంపుతో ధరలు హైరేంజ్ కు వచ్చాయి. పెట్రోల్ – డీజిల్ మధ్య ధరల్లో తేడా బాగా తగ్గిపోయింది. ముఖ్యంగా డీజిల్ ధరలు పెరగటంతో ఆ ప్రభావం నిత్యావసరాలపై పడింది. అంతర్జాతీయంగా ప్రస్తుతం ముడిచమురు ధరలు కూడా పెరుగుతున్నాయి. ఈ లెక్కన పెంచుకుంటూ పోతే.. వాహనదారులపై మరింత భారం పడనుంది. ఈ క్రమంలోనే ధరలను పెంచొద్దని ఆయిల్ కంపెనీలకు కోరింది కేంద్రం. ఓపెన్ మార్కెట్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవటం మొదటిసారి ఇదే. మరి ఆయిల్ కంపెనీలు వింటాయా.. లేదో చూడాలి..

Posted in Uncategorized

Latest Updates