ఆయిల్ ట్యాంకర్ ను ఢీ కొట్టిన వాహనం…50 మంది మృతి

మధ్య ఆఫ్రికా దేశం డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగోలో శనివారం(అక్టోబర్-6) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజధాని కిన్షాసాకు 130 కిలోమీట్ల దూరంలో..ఎమ్ బుటా గ్రామం దగ్గర్లో నేషనల్ హైవేపై ఓ వాహనాన్ని ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. రెండు వాహనాలు వేగంగా ఒకదానికొకటి ఢీకొట్టిన వెంటనే మంటలు చెలరేగాయి. ట్యాంకర్‌ లో ఉన్న ఆయిల్ దగ్గర్లోని ఇళ్లపై పడటంతో.. 50 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశ‌మున్న‌ట్లు అధికారులు తెలిపారు. పరిసర ప్రాంతాలకు మంటలు వ్యాపించడంతో భారీగా ఆస్తి నష్టం కూడా జరిగింది. మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశ‌మున్న‌ట్లు అధికారులు తెలిపారు

Posted in Uncategorized

Latest Updates